NTR : స్టేజి పై పవన్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న ఎన్టీఆర్.. మీమ్స్ బాగా ఫాలో అవుతున్నాడుగా..
ఎన్టీఆర్ మీమ్స్ ని బాగా ఫాలో అవుతున్నాడుగా. స్టేజి పై పవన్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న ఎన్టీఆర్..

NTR said Pawan Kalyan Prabhas dialogues at Tillu Square event
NTR : సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ సూపర్ హిట్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో నేడు ఈ మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరుకాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ కూడా స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలోని డైలాగ్స్ చెప్పారు.
ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తీసుకు వచ్చేటప్పుడు మేకర్స్ చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెల్ మొదటి సినిమాని మెప్పించకపోతే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ విషయం గురించే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కల కనడానికి ఒక ధైర్యం ఉండాలి. అయితే ఆ కలని నిజం చేసుకోవడానికి భయం ఉండాలి” అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందు చెప్పుకొచ్చారు.
Also read : Samantha – Akhil : ఈ ఏడాది కూడా మర్చిపోకుండా.. అఖిల్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన సమంత..
దానికి త్రివిక్రమ్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. “కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతేగాని నేను ఇక్కడ ఉన్నానని గుర్తించండి. ఐయామ్ టెల్లింగ్ దట్. పోలె అదిరిపోలే” అంటూ అత్తారింటికి దారేది, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని డైలాగ్స్ ని మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ కి స్టేజి పైన ఉన్న సెలబ్రిటీస్, కింద ఉన్న అభిమానులు పడిపడి నవ్వుకున్నారు.