Samantha – Akhil : ఈ ఏడాది కూడా మర్చిపోకుండా.. అఖిల్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన సమంత..
ఈ ఏడాది కూడా మర్చిపోకుండా అఖిల్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన సమంత. వైరల్ అవుతున్న పోస్ట్..

Samantha birthday wishes to Akkineni Akhil post viral
Samantha – Akhil : స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లకే చైతన్యకి విడాకులు ఇచ్చి సమంత అక్కినేని కుటుంబం నుంచి బయటకి వచ్చేసారు. కానీ అక్కినేని కుటుంబంతో మాత్రం మంచి సంబంధాలే మెయిన్‌టైన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన విషయాలు అందరికి కనిపిస్తూనే వస్తున్నాయి.
తాజాగా సమంత అఖిల్ కి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్ట్ వేశారు. అఖిల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లోని ఫోటోని తన స్టోరీలో షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్ డే అఖిల్. ఈ ఇయర్ నీకు వండర్‌ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లేస్ యూ” అంటూ ఆశీర్వదిస్తూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. కాగా నాగచైతన్యతో విడిపోయిన తరువాత నుంచి కూడా సమంత ప్రతి ఏడాది అఖిల్ కి విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు.
Also read : Thalaivar 171 : రజినీకాంత్ సినిమా అప్డేట్‌ని లీక్ చేసిన సందీప్ వంగ.. లోకేష్ కనగరాజ్ అదరగొట్టేశాడట..
ఇక ఇలా ప్రతి ఏడాది మర్చిపోకుండా అఖిల్‌కి బర్త్ డే విషెస్ తెలియజేయడం అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటుంది. సమంత బర్త్ డే సమయంలో నాగచైతన్య తప్ప ఇతర అక్కినేని వారసులు కూడా సోషల్ మీడియాలో బర్త్ డేకి విషెస్ చెబుతూ వస్తున్నారు. విడిపోయిన తరువాత కూడా సమంత అండ్ అక్కినేని ఫ్యామిలీ మధ్య ఈ హెల్దీ రేలషన్‌షిప్ కనిపించడం.. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా కనిపిస్తుంది.