NTR-Ram Charan : మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోటీ ఉంది

ఈ ప్రమోషన్స్ లో భాగంగా వేరే భాషలో ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. రామ్ చరణ్, నందమూరి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ..

NTR-Ram Charan :  మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోటీ ఉంది

Ntrramcharan

Updated On : December 26, 2021 / 3:43 PM IST

NTR-Ram Charan :   రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ట్రైలర్ అయితే సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ట్రైలర్ చూసిన దగ్గర్నుంచి ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని జనవరి 7న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

దీంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. వరుస ఈవెంట్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం అంతా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వేరే భాషలో ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని వెల్లడించాడు.

Krithi Shetty : లిప్‌లాక్, బోల్డ్ సీన్స్ అన్నీ మామూలు సీన్స్ లాంటివే : కృతిశెట్టి

ఈ సందర్భంగా ఎన్టీఆర్.. రామ్ చరణ్, నందమూరి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ…. ”ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మా రెండు కుటుంబాల మధ్య గత 35 సంవత్సరాలుగా పోరు నడుస్తుంది. అన్ని సినిమాలకి మా మధ్య పోటీ ఉంది. కానీ నేను,రామ్‌చరణ్‌ మంచి స్నేహితులం. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత దేశంలోని టాప్‌ స్టార్స్‌ అందరూ కలుస్తారని, మరిన్ని భారీ మల్టీ స్టారర్‌ చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది” అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.