Nushrratt Bharuccha : ఇజ్రాయిల్ పై హమాస్ దాడుల నుంచి బయటపడిన తర్వాత.. మొదటిసారి స్పందించిన బాలీవుడ్ నటి..
నుష్రత్ భరూచా ఇండియాలో దిగాక ఆమెను మీడియా చుట్టుముట్టింది. అక్కడి యుద్ధ పరిస్థితుల గురించి అడిగింది. కానీ నుష్రత్ భరూచా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తాజాగా అక్కడ తాను యుద్ధ వాతావరణంలో ఎదుర్కున్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

Nushrratt Bharuccha Reacts first time after Reaching India from Israel
Nushrratt Bharuccha : పాలస్తీనా(Palestine) – ఇజ్రాయిల్(Israel) వార్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులకు పాల్పడి అక్కడి పౌరులను బందీలుగా మార్చి, వారిపై అకృత్యాలకు పాల్పడి, పలువురిని కిరాతకంగా చంపేస్తున్నారు. ఇజ్రాయిల్ తీవ్రవాదుల దాడికి సమాధానం చెప్పాలని వాళ్ళు కూడా హమాస్ లు ఉన్న స్థావరాలపై దాడులు మొదలుపెట్టారు. అయితే ఈ యుద్ధంలో పలువురు వేరే దేశాలకు చెందినవారు ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయారు. వారి పరిష్టితి దయనీయంగా ఉంది.
అయితే ఇజ్రాయిల్ లో జరిగే హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్ భరూచాతో పాటు పలువురు ఇటీవల ఇజ్రాయెల్ వెళ్లారు. దాడులు మొదలయ్యాక ఆమె టీంలోని సభ్యుడు నుష్రత్ భరూచా అక్కడే హోటల్ లో చిక్కుకున్నట్టు భారతీయ రాయబారి అధికారులకు తెలిపారు. నుష్రత్ భరూచా అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఇజ్రాయిల్ లోని భారత రాయబారి కార్యాలయం రంగంలోకి దిగి ఆమెని అక్టోబర్ 8న ఇండియాకు కనెక్ట్ ఫ్లైట్ లో పంపించారు.
నుష్రత్ భరూచా ఇండియాలో దిగాక ఆమెను మీడియా చుట్టుముట్టింది. అక్కడి యుద్ధ పరిస్థితుల గురించి అడిగింది. కానీ నుష్రత్ భరూచా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తాజాగా అక్కడ తాను యుద్ధ వాతావరణంలో ఎదుర్కున్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అలాగే అక్కడ తాను ఎదుర్కున్న పరిస్థితులపై ఓ ఎమోషనల్ లెటర్ కూడా పోస్ట్ చేసి తమను రక్షించిన వారికి థ్యాంక్స్ చెప్పింది.
Also Read : Aamir Khan : నేను, నా కుమార్తె మానసిక సమస్యలని ఎదుర్కొన్నాం.. కూతురితో కలిసి అమీర్ ఖాన్ వీడియో..
నుష్రత్ భరూచా ఇజ్రాయిల్ నుంచి వచ్చిన తర్వాత మొదటిసారి స్పందిస్తూ.. రెండు రోజుల క్రితం నేను ఇజ్రాయిల్ లోని ఓ హోటల్ లో ఉన్నాను. దాడులు ప్రారంభం అయ్యాక 36 గంటల పాటు ప్రత్యక్ష నరకం చూశాను. ఆ సమయంలో నా చుట్టుపక్కల అంతా బాంబుల శబ్దం వినిపించింది. హోటల్ లో ఉన్నవాళ్ళంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మాకు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అక్కడే హోటల్ బంకర్ లో దాక్కున్నాం. ఇలాంటి పరిస్థితి నాకెప్పుడూ ఎదురు కాలేదు. ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చాను. ఇక్కడ సేఫ్ గా ఉన్నాను. ఇది చూశాక నాకు మనం ఎంత సురక్షితమైన దేశంలో ఉన్నామో తెలుస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఇండియన్ ఎంబసీ, ఇజ్రాయిల్ ఎంబసీకి నన్ను నా దేశానికి సేఫ్ గా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇజ్రాయిల్ లో చిక్కుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను అని తెలిపింది. దీంతో ఈ వీడియో, పోస్ట్ వైరల్ గా మారాయి.