‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా!
Om Raut about Adipurush: ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులు అంగీకరిస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకోసం తన శరీరాకృతి మార్చుకోబోతున్నట్లు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు.
ప్రభాస్ హైట్, ఫిజిక్ రాముడిలా ఉంటాయి.. వ్యక్తిగతంగా కూడా తనలో రాముడి లక్షణాలున్నాయి అందుకే అతణ్ణి ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నామని ఓం రౌత్ అన్నారు. రాముడి పాత్రలో ధీరుడిగా కనిపించేందుకు ప్రభాస్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట.
బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్న డార్లింగ్ ఇప్పుడు ఆది పురుష్ లోని కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలు విద్య నేర్చుకోడానికి తనని తాను ట్రాన్స్ఫర్మ్ చేసుకోనున్నాడట. అలాగే మంచి బాడీ ఫిట్నెస్ కోసం అప్పుడే ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ కూడా చేస్తున్నాడట.
3డిలో తెరకెక్కబోయే ఆదిపురుష్ వచ్చే ఏడాది ప్రధమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది.