Orange re release : మ‌రోసారి రామ్‌చ‌ర‌ణ్ ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌.. ఎప్పుడో తెలుసా?

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్ తొలి నాళ్ల‌లో న‌టించిన మూవీ ఆరెంజ్‌.

Orange re release : మ‌రోసారి రామ్‌చ‌ర‌ణ్ ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌.. ఎప్పుడో తెలుసా?

Once again Ram Charan Orange movie re releasing

Updated On : January 23, 2025 / 5:46 PM IST

ఇటీవ‌ల కాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు లేదా స్పెష‌ల్ డేస్ సంద‌ర్భంగా సినిమాల‌ను రీ రిలీజ్‌ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్ తొలి నాళ్ల‌లో న‌టించిన మూవీ ఆరెంజ్‌. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో జెనీలియా క‌థానాయిక‌. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 2010లో విడుద‌లైంది. అప్ప‌ట్లో ఈ చిత్రంలోని పాట‌లు ఓ ట్రెండ్‌ను సెట్ చేశాయి. ఇప్ప‌టికి కూడా ఈ పాట‌లు వింటుంటే వినాల‌నే అనిపిస్తూ ఉంటుంది.

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 2023లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయ‌గా అద్భుత‌మైన సంద‌న వ‌చ్చింది. రీ రిలీజ్ స‌మ‌యంలో థియేట‌ర్ల‌లో అభిమానులు పాట‌లు పాడుతూ డ్యాన్స్ లు చేసిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఇక ఈ స్పెష‌ల్ షోల ద్వారా వ‌చ్చే మొత్తాన్ని జ‌న‌సేన పార్టీకి విరాళంగా ఇచ్చారు కూడా. తాజాగా ఈ చిత్రాన్ని మ‌రోసారి రీ రిలీజ్ చేయ‌నున్నారు.

Sankranthiki Vasthunnam : క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’.. తొమ్మిది రోజుల్లో ఎంతంటే?

ప్రేమికుల దినోత్స‌వం (వాలెంటైన్స్ డే) సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ విష‌యం తెలిసి అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. వాలెంటైన్స్ డే ఆరెంజ్ చిత్రాన్ని చూసేందుకు వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Laila : ‘లైలా’ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ ‘ఇచ్చుకుందాం బేబీ’ వ‌చ్చేసింది..

ఇదిలా ఉంటే.. రామ్‌చ‌ర‌ణ్ ఇటీవ‌ల గేమ్ ఛేంజ‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ క‌థానాయిక‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కాగా మిశ్ర‌మ స్పంద‌నలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం చెర్రీ.. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో 16వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.