Sankranthiki Vasthunnam : కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. తొమ్మిది రోజుల్లో ఎంతంటే?
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ కొట్టారు

Sankranthiki Vasthunnam Movie Nine Days Collections Details here
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ కొట్టారు. అనిల్ రావి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్‌లో ఈ చిత్రం చేరింది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.230కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది.
ఈ చిత్రం తొలి రోజునే భారీ కలెక్షన్స్ సాధించింది. మొదటి రోజు ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసి వెంకిమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రెండో వారంలోనూ ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.
ఈ వారంలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి బాగా కలిసి రానుంది. దీంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలు నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ లు కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.
₹230Crore+ Gross Worldwide in just 9 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥
Every section of audience are celebrating #SankranthikiVasthunam making it their most cherished film of this Sankranthi ❤️❤️❤️
ALL TIME RECORD FOR A REGIONAL FILM🔥
Victory @venkymama… pic.twitter.com/DO7HD8xQAs
— Sri Venkateswara Creations (@SVC_official) January 23, 2025