నిర్మాతను అయ్యాకే రియల్ మెగాస్టార్‌ను కలిశా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమాడ విడుదల కాబోతుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. దక్షిణాదిలోని భాషలతో పాటు హిందీ సహా ఐదు భాషల్లో సినిమా విడుదల చేస్తుంది సినిమా యూనిట్.
ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. లేటెస్ట్ గా రామ్ చరణ్ సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి ఫొటోను షేర్ చేశారు. నిర్మాతను అయిన తర్వాతే రియల్ మెగాస్టార్‌ను కలిశాను అంటూ ఫోటోకు కాప్షన్ పెట్టారు. సైరా సెట్స్‌లో రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి మేకప్ చూస్తున్న ఫొటో అది.