#Oscars2023 : ఆస్కార్ నామినీస్ కి స్పెషల్ లంచ్.. లాస్ ఏంజిల్స్ లో కీరవాణి, చంద్రబోస్ సందడి..

మార్చ్ 12న ఆస్కార్ వేడుక లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరగనుంది. తాజాగా ఆస్కార్ నామినీస్ దక్కించుకున్న వాళ్లందరికీ ఆస్కార్ టీం స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల్లో నామినేట్ అయిన వాళ్లంతా వచ్చారు. నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది కనుక కీరవాణితో పాటు ఆ పాట రచయిత చంద్రబోస్.............

#Oscars2023 : ఆస్కార్ నామినీస్ కి స్పెషల్ లంచ్.. లాస్ ఏంజిల్స్ లో కీరవాణి, చంద్రబోస్ సందడి..

Oscars 2023 special lunch Program keeravani and chandrabose center of attraction with naatu naatu

Updated On : February 14, 2023 / 2:17 PM IST

#Oscars2023 :  RRR మూవీ విడుదలై ఇప్పటికి 11 నెలలవుతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. గ్లోబల్ రేంజ్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. జపాన్‌లోనూ ఈ మూవీ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. రీసెంట్ గా లాస్‌ ఏంజెల్స్‌లో నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుంది. అలాగే ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్స్‌లోనూ చోటు దక్కించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. నాటు నాటు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడంతో భారతదేశం అంతా గర్వపడుతుంది. చిత్రయూనిట్ సంతోషంలో ఉన్నారు. ఇక కీరవాణిని, ఈ పాటకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని అందరూ అభినందిస్తున్నారు.

మార్చ్ 12న ఆస్కార్ వేడుక లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరగనుంది. తాజాగా ఆస్కార్ నామినీస్ దక్కించుకున్న వాళ్లందరికీ ఆస్కార్ టీం స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల్లో నామినేట్ అయిన వాళ్లంతా వచ్చారు. నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది కనుక కీరవాణితో పాటు ఆ పాట రచయిత చంద్రబోస్ కూడా లాస్ ఏంజిల్స్ కి వెళ్లారు. ఆస్కార్ నామినేట్ అయిన హాలీవుడ్ స్టార్స్ తో పాటు మన కీరవాణి, చంద్రబోస్ సందడి చేశారు. అలాగే ఆస్కార్ నామినీస్ అందరికి ఫోటోషూట్ చేశారు, గ్రూప్ ఫోటో దిగారు.

Janhvi Kapoor : NTR30లో జాన్వీ ఫిక్స్? బాలీవుడ్‌లో వరుస కథనాలు..

లాస్ ఏంజిల్స్ లో కీరవాణి, చంద్రబోస్ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలాగే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్గ్ తో చంద్రబోస్, కీరవాణి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాక చంద్రబోస్, కీరవాణి పలు హాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ RRR సినిమా గురించి, ఇండియన్ సినిమా గురించి గొప్పగా చెప్పారు. కీరవాణి, చంద్రబోస్ లాస్ ఏంజిల్స్ లో సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మార్చ్ 12న నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని భారతదేశం అంతా కోరుకుంటుంది.