Paisa Wala : డబ్బు ఇంపార్టెన్స్ చెప్పే పైసా సాంగ్.. ‘పైసావాలా’ సినిమా నుంచి రిలీజ్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్‌ రిలీజవ్వగా తాజాగా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. (Paisa Wala)

Paisa Wala : డబ్బు ఇంపార్టెన్స్ చెప్పే పైసా సాంగ్.. ‘పైసావాలా’ సినిమా నుంచి రిలీజ్..

Paisa Wala

Updated On : November 15, 2025 / 4:29 PM IST

Paisa Wala : అధ్విక్, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘పైసావాలా’. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె.నవీన్ తేజస్, పిజె దేవి నిర్మాణంలో కె. నవీన్ తేజస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Paisa Wala)

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్‌ రిలీజవ్వగా తాజాగా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ని విశాఖపట్నంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అధ్విక్, దర్శకుడు కె. నవీన్ తేజస్, నిర్మాతలు పైడిరాజు, పి.ఎస్.ఎన్. రాజు హాజరయ్యారు.

Also Read : Neha Sharma : పాపం రామ్ చరణ్ హీరోయిన్.. ఇల్లిల్లు తిరిగినా ఎన్నికల్లో ఓడిపోయిన తండ్రి.. ప్రచారం వీడియో వైరల్..

‘జీవుల మనుగడకు సృష్టించిన పైసా.. జీవం లేకున్నా నిర్జీవిరా పైసా’ అంటూ సాగే ఈ పాటను నగేశ్ గౌరీష్ సంగీత దర్శకత్వంలో ఈవీఆర్ & గురుబిల్లి జగదీష్ రాయగా కాకి లక్ష్మణ్‌రెడ్డి పాడారు. డబ్బుతో ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలియజేసేలా ఈ పాటను రచించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనుంది.

మీరు కూడా ఈ పైసవాలా సాంగ్ వినేయండి..

Also Read : Tollywood Comedians : చిల్డ్రన్స్ డే స్పెషల్.. కమెడియన్స్ అంతా భలే రెడీ అయ్యారే.. ఈ ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..