Humaira Asghar Ali : తన అపార్టుమెంట్‌లోనే శవమై కనిపించిన నటి.. కుళ్ళిపోయిన స్థితిలో..
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి, మోడల్, రియాలిటీ టీవీ స్టార్ హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద స్థితిలో తన అపార్టుమెంట్‌లో మృతి చెంది కనిపించింది.

Pakistani Actress Humaira Asghar Ali Found Dead In Karachi Flat
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి, మోడల్, రియాలిటీ టీవీ స్టార్ హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద స్థితిలో తన అపార్టుమెంట్‌లో మృతి చెంది కనిపించింది. ఆమె వయసు 32 సంవత్సరాలు.
స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. హుమైరా అస్గర్ అలీ కరాచీలోని ఇత్తేహాద్ కమర్షియల్ ఫేజ్ VIలోని ఓ భవనంలో అద్దెకు ఉంటోంది. గత కొన్నేళ్లుగా ఆమె ఒక్కతే ఆ అపార్టుమెంట్‌లో నివసిస్తోంది. కాగా.. గత కొన్ని వారాలుగా ఆమె ఎవ్వరికి కనిపించడం లేదు.
అదే సమయంలో ఆమె 2024 నుంచి యజమానికి అద్దె చెల్లించడం లేదు. దీంతో విసుగు చెందిన ఆ ఇంటి యజమాని కోర్టుకు వెళ్లాడు. అపార్టుమెంట్‌ను చెక్ చేసి రిపోర్టు ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో స్థానిక పోలీసులు నటి ఉంటున్న అపార్టుమెంట్‌కు వెళ్లారు. వారు చాలా సేపు కాలింగ్ బెల్, తలుపు కొట్టారు. ఎంతసేపటికి కూడా ప్రతి స్పందన లేకపోవడంతో ఆఖరికి తలుపులు బద్దలు కొట్టారు.
లోనికి వెళ్లి చూడగా ఆమె శవమై కనిపించింది. ఆమె మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరణించి దాదాపు రెండు నుంచి మూడు వారాలు అవుతున్నట్లుగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఆమె ఎలా మరణించింది అనే విషయం తెలుస్తుందన్నారు. ప్రాథమిక విచారణలో నటి సహజంగా మరణించినట్లుగా భావిస్తున్నట్లుగా చెప్పారు.
Chiranjeevi : ఇటీవలే బ్రహ్మానందం.. త్వరలో చిరంజీవి.. అది వస్తే బోలెడన్ని విశేషాలు..
లాహోర్‌లో హుమైరా జన్మించింది. లాహోర్‌లోని నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్ & డిజైన్ లలో విజువల్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. 2013 నుంచి ఆమె మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత టెలివిజన్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జస్ట్ మ్యారీడ్, ఎహ్సాన్ ఫరామోష్ వంటి షోటలతో గుర్తింపు తెచ్చుకుంది. 2015లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. యాక్షన్ థ్రిల్లర్ జలైబీ, లవ్ వ్యాక్సిన్ వంటి సినిమాల్లో నటించిన ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.