Chiranjeevi : ఇటీవలే బ్రహ్మానందం.. త్వరలో చిరంజీవి.. అది వస్తే బోలెడన్ని విశేషాలు..

కొన్నాళ్ల క్రితం చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..

Chiranjeevi : ఇటీవలే బ్రహ్మానందం.. త్వరలో చిరంజీవి.. అది వస్తే బోలెడన్ని విశేషాలు..

Chiranjeevi

Updated On : July 9, 2025 / 6:27 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి జగదేక వీరుడిగా నిలిచి మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ని మెగాస్టార్ గా ఏలారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కోట్ల మంది ఆయనకు అభిమానులుగా ఆన్నారు. ఆయన్ని చూసి సినీపరిశ్రమకు ఎన్నో వేలమంది వచ్చారు.

చిరంజీవి పలు స్టేజీలపై తన సినిమాలు, అప్పటి విషయాలు, తన గురించి చెప్పినా ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, మెగాస్టార్ చరిత్ర, ఆయన సాధించిన విజయాలు, ఆయన కష్టం తెలుసుకోవాలి అనే అనుకుంటాం. మెగాస్టార్ పై ఫ్యూచర్ లో బయోపిక్ వస్తుందో లేదో కానీ చిరంజీవి ఆత్మకథ బుక్ అయితే వస్తుందని సమాచారం. ఇప్పటికే పలువురు రచయితలు, జర్నలిస్ట్ లు చిరంజీవి మీద బుక్స్ రాశారు. ఇప్పుడు చిరంజీవి స్వంతంగా ఆయన జీవిత కథని బుక్ గా రాస్తున్నారట.

Also Read : Smriti Irani : 25 ఏళ్ళ క్రితం 1800.. ఇప్పుడు ఏకంగా 14 లక్షలు.. జస్ట్ ఒక్క ఎపిసోడ్ కి.. మాజీ కేంద్ర మంత్రి రెమ్యునరేషన్..?

కొన్నాళ్ల క్రితం చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. నేను ఆత్మకథ రాయాలి అనుకుంటున్నాను. కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు నా సంగతులు మాట్లాడుతూ వీడియోలు రికార్డ్ చేసుకున్నాను. సురేఖతో కలిసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వాటిని రికార్డ్ చేస్తున్నాను అని తెలిపారు. ఇప్పుడు మరోసారి ఈ కామెంట్స్ వైరల్ అవ్వగా దీంతో చిరంజీవి ఆత్మకథ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాను. ఈ ఆత్మకథలో చిరంజీవి చైల్డ్ హుడ్ మూమెంట్స్ తో పాటు సినిమా మూమెంట్స్, సినిమాలకు వచ్చిన గ్యాప్ గురించి కూడా ఉంటాయని భావిస్తున్నారు.

ఇటీవలే కొన్ని నెలల క్రితం బ్రహ్మానందం ఆత్మకథ ‘నేను’ అనే పుస్తకం రిలీజయి బాగా అమ్ముడయింది. ఇప్పుడు చిరంజీవి ఆత్మకథ వస్తే బెస్ట్ సెల్లర్ గా నిలవడం ఖాయం. మరి మెగాస్టార్ ఆ బుక్ ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో? ఆ బుక్ ప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. చిరంజీవి ఆత్మకథ వస్తే బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.

Also Read : Anil Geela : హీరోగా మారిన తెలంగాణ యూట్యూబర్.. వెబ్ సిరీస్ తో.. స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడు?