Vishnu Priya : విష్ణుప్రియ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు..! ఒక్కో ప్రమోషన్ కు ఎంత డబ్బు తీసుకుందంటే..
మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ను ఆమె ప్రమోట్ చేసినట్లుగా గుర్తించారు.

Vishnu Priya : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. పలువురు టీవీ, సినీ ప్రముఖులకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు పంజాగుట్ట పోలీసుల ముందుకు వస్తున్నారు. టీవీ నటి విష్ణుప్రియ పంజాగుట్ట పీఎస్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు విష్ణుప్రియని ప్రశ్నించారు.
ఆమె స్టేట్ మెంట్ ని రికార్డ్ చేశారు. విష్ణుప్రియ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే టేస్టింగ్ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ను విచారించిన పోలీసులు విష్ణుప్రియ స్టేట్ మెంట్ ని రికార్డ్ చేశారు. ఆ తర్వాత మరో టీవీ నటి రీతూ చౌదరి సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు రీతూని ప్రశ్నించారు.
Also Read : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రీతూ చౌదరి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకి సంబంధించి విష్ణుప్రియ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. అనంతరం ఆమె వ్యక్తిగత ఫోన్ ని సీజ్ చేసినట్లు సమాచారం.
కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లు, యూట్యూబర్లు, టీవీ, సినీ సెలబ్రిటీలపై పోలీసులు సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ తో చాలామంది సాధారణ ప్రజలు ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో పోలీసులు దీనిపై ఫోకస్ చేశారు. యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు.
విష్ణుప్రియ స్టేట్ మెంట్ ను నమోదు చేసిన పోలీసులు సంచలన విషయాలను రాబట్టారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ను ఆమె ప్రమోట్ చేసినట్లుగా గుర్తించారు. ఒక్కొ ప్రమోషన్ కు 90వేల రూపాయలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో విష్ణుప్రియ అంగీకరించినట్లు సమాచారం.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్లుగా గుర్తించారు. ఎంత డబ్బు తీసుకున్నారు? ఏ ఖాతాకు ఆ నగదును బదిలీ చేశారు? అనేదానిపై ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్ ను తీసుకున్నారు. విచారణ తర్వాత విష్ణుప్రియ పర్సనల్ మొబైల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు.