Mirzapur Season 3 : మీర్జాపూర్ సీజన్ 3 టీజర్ వచ్చేసింది.. సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..?

తాజాగా మీర్జాపూర్ సీజన్ 3 టీజర్ రిలీజ్ చేసి సిరీస్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

Mirzapur Season 3 : మీర్జాపూర్ సీజన్ 3 టీజర్ వచ్చేసింది.. సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..?

Pankaj Tripathi Ali Fazal Shweta Tripathi Mirzapur Season 3 Teaser Released and Streaming Date Announced

Updated On : June 11, 2024 / 2:27 PM IST

Mirzapur Season 3 Teaser : కరోనా సమయంలో ఓటీటీలతో వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. అందులో కొన్ని సిరీస్ లు మాత్రం పెద్ద హిట్ అయి సీజన్స్ కోసం ప్రేక్షకులను ఎదురుచూసేలా చేసాయి. వాటిల్లో మీర్జాపూర్ సిరీస్ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ అడల్ట్ తో పాటు క్రైమ్ కూడా ఎక్కువ ఉండటంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సిరీస్ లోని మున్నా భాయ్, గుడ్డు క్యారెక్టర్స్ కి మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చింది.

కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మీర్జాపూర్ ఇప్పటికి రెండు సీజన్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ రెండు సీజన్స్ మంచి హిట్ అయ్యాయి. దీంతో అందరూ మూడో సీజన్ కోసం వెయిట్ చేయగా తాజాగా మీర్జాపూర్ సీజన్ 3 టీజర్ రిలీజ్ చేసి సిరీస్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

Also Read : Prabhas – Kalki : అసలు ప్రభాస్ ‘కల్కి’ కాదా? మరి కల్కి ఎవరు? ప్రభాస్ పాత్ర ఏంటి? ఇదెక్కడి ట్విస్ట్ బ్రో..

పంకజ్ త్రిపాఠి, దివ్యేనందు, అలీ ఫాజిల్, రసిక, శ్వేతా త్రిపాఠి, ఇషా తల్వార్, హర్షిత గౌర్, విజయ్ వర్మ.. ఇలా చాలా మంది బాలీవుడ్ నటీనటులు నటించిన మీర్జాపూర్ మూడో సీజన్ టీజర్ అమెజాన్ ప్రైమ్ తాజాగా విడుదల చేసింది. ఇక ఈ మూడో సీజన్ ని జులై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో ఈ సిరీస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మీర్జాపూర్ సీజన్ 3 టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సారి మరింత పొలిటికల్ టచ్ తో పాటు క్రైం సీన్స్ ఎక్కువే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీర్జాపూర్ సీజన్ 3 టీజర్ మీరు కూడా చూసేయండి..