Parineeti Chopra: లండన్ పర్యటనలో పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యక్షం
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. మే 13 న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది.

Parineeti Chopra-Raghav Chadha
Parineeti Chopra-Raghav Chadha: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. మే 13 న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది చివరిలో పెళ్లితో ఒక్కటి కానున్నారు. కాగా.. పెళ్లి తేదీ కోసం అందరూ ఎదురుచూస్తుండగా పరిణీతి, రాఘవ్ లు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు.
ఇక వీరిద్దరికి క్రికెట్ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను మొహాలీ స్టేడియంలో చూశారు. ప్రస్తుతం లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పరిణీతి, రాఘవ్‌లు ఓవల్ మైదానానికి వెళ్లి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Parineeti Chopra : పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ ఫోటోలు..
తెల్లటి దుస్తులపై ఆకు పచ్చ రంగు బ్లేజర్ ధరించి సన్‌గ్లాసెస్‌తో పరిణీతి చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె పక్కన నీలిరంగు స్వెటర్, నలుపు ప్యాంటు, సన్‌గ్లాసెస్ పెట్టుకుని రాఘవ్ కూర్చొని ఉన్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Parineeti-Raghav at WTC Final
ఇదిలా ఉంటే.. పరిణీతి మరియు రాఘవల పెళ్లి ఇరు కుటుంబాల సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జరగనుంది. వీరి నిశ్చితార్థం సమయంలో కూడా వీరి ఆచారాలు కనిపించాయి. ఇక వివాహం రాజస్థాన్‌లో చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయపూర్‌లోని ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో వీరు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పిచోలా సరస్సు ఒడ్డున ఉంది ఒబెరాయ్ ఉదయవిలాస్. అందమైన సరస్సుకు ఎదురుగా విలాసవంతమైన తోటల మధ్యలో ప్రకృతి కమనీయంగా ఉంటుంది ఇక్కడ.
NBK 109 : బాలయ్య బర్త్ డే సర్‌ప్రైజ్ అదిరిందిగా.. బాబీతో బాలయ్య సినిమా.. NBK109 ఓపెనింగ్..
బాలీవుడ్ ప్రముఖ జంటలు కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీలు రాజస్థాన్‌లోనే వివాహం చేసుకున్నారు.