Pawan Kalyan : ఏపీ రాజకీయాలు గురించి సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలి..?
ఏపీ రాజకీయాలు గురించి సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలి..? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు.

Pawan Kalyan about comments of tollywood should react ap politics
Pawan Kalyan : ఇటీవల ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని పరిణామాల మీద సినిమా పరిశ్రమ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదని పలువురు రాజకీయనేతలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ తో కొంతమంది వాటి స్పందిస్తూ వస్తుంటే, సురేష్ బాబు వంటి బాగా నిర్మాతలు.. సినిమా రంగాన్ని నాన్ రిలీజియస్, నాన్ పొలిటికల్ గా చూడండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ విషయం పై పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యాడు.
ఒక తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యిన పవన్ మాట్లాడుతూ.. “ఏపీ రాజకీయాలు గురించి సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడాలి..? వాళ్ళు కళాకారులు. సినిమాలతో ఎంటర్టైన్ చేయడం వాళ్ళ పని. వాళ్ళు ఏ చిన్న విషయం చేసిన కాంట్రవర్సిలో చిక్కుకునే స్థానంలో ఉన్నారు. అలాంటి వారిని రాజకీయాల్లోకి లాగడం సరి కాదు. ఈ విషయంలో మీడియా ఛానల్స్ సినిమా వారికీ అండగా ఉండాలి” అంటూ పేర్కొన్నాడు.
Also read : Pawan Kalyan : సొంత సినిమా టైటిల్ మర్చిపోయిన పవన్.. వైరల్ అవుతున్న వీడియో..
“సినిమాలకు సెన్సార్ ఉంటుంది. కానీ ఛానల్స్ కి సెన్సార్ ఉండడం లేదు. మీడియా ఛానల్స్ సినిమా రంగం వారి కాంట్రవర్సి టాపిక్స్ ని అమ్ముకునే ప్రయత్నం చేయకుండా కళని, కళాకారులను, చిత్రసీమ సమస్యలను చూపించే ప్రయత్నం చేయండి. సినిమా అనేది ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు సందేశం ఇచ్చే మాధ్యమంగా కూడా పనిచేస్తుంది. ఈ రంగంలో ఎంతో గొప్ప కళాకారులు, రచయితలు ఉన్నారు. వారిని మర్చిపోతున్నారు. వారి గురించి అందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.