Pawan Kalyan – Anand Sai : టీటీడీ బోర్డు మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎమోషనల్ పోస్ట్..

టీటీడీ బోర్డు మెంబర్స్ లో పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ ఆర్కిటెక్ట్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.

Pawan Kalyan – Anand Sai : టీటీడీ బోర్డు మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎమోషనల్ పోస్ట్..

Pawan Kalyan Best Friend Anand Sai Take oath as a TTD Member

Updated On : November 7, 2024 / 11:45 AM IST

Pawan Kalyan – Anand Sai : ఇటీవల ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త బోర్డు ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ చైర్మన్ గా BR నాయుడు, మిగిలిన బోర్డు మెంబర్స్ ప్రమాణస్వీకారం కూడా చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ బోర్డు మెంబర్స్ లో జనసేన తరపున కూడా పలువురు ఉన్నారు.

Also Read : Thug Life : కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే..

అయితే టీటీడీ బోర్డు మెంబర్స్ లో పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ ఆర్కిటెక్ట్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ క్రమంలో ఫ్యామిలీతో వచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ వేదాశీర్వచనం అందుకున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ గా సెలెక్ట్ చేసినందుకు ఎమోషనల్ అయి కొన్ని రోజుల క్రితమే ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ చేసాడు.

View this post on Instagram

A post shared by ANAND SAI (@artdirectoranandsai)

ఎంతో ట్యాలెంట్, వాస్తు, ధర్మం మీద పట్టు ఉన్న ఆనంద్ సాయి లాంటి వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండటం మంచి విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆనంద్ సాయి తొలిప్రేమ సినిమా నుంచి పవన్ వెన్నంటే ఉన్నారు. జనసేన ప్రయాణంలో, గెలిచాక కూడా ఆనంద్ సాయి తన ఫ్రెండ్ ని వీడలేదు. చాలా మంది పవన్ ఫ్యాన్స్ పవన్ కి ఇంత మంచి స్నేహితుడు ఉండటం అదృష్టం అని అంటూ ఉంటారు. తొలిప్రేమలో పవన్ చెల్లెలిగా నటించిన వాసుకి ఆనంద్ సాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.