Pawan Kalyan : ఆదిపురుష్ సినిమా ఎలా ఉన్నా.. ప్రభాస్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్..

తాజాగా నరసాపురంలో పవన్ బహిరంగ సభ నిర్వహించగా కొంతమంది ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పవన్ ఫొటోలతో వచ్చారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు అంటూ ప్రభాస్ గురించి మాట్లాడారు.

Pawan Kalyan : ఆదిపురుష్ సినిమా ఎలా ఉన్నా.. ప్రభాస్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్..

Pawan Kalyan comments on Prabhas in Varahi Yatra at Narasapuram

Updated On : June 27, 2023 / 11:48 AM IST

Pawan Kalyan – Prabhas :  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు. ఏపీ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర (varahi vijaya yatra) చేస్తూ పలు ఊర్లల్లో బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పవన్ ఎక్కువగా సినిమా హీరోల పేర్లు తీసుకొస్తున్నారు. అందరు హీరోలు ఒకటే, మేమంతా కలిసే ఉంటాం, సినిమా వేరు రాజకీయం వేరు, మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి కానీ రాజకీయంగా ఒక్కటై నాకు సపోర్ట్ చేయండి అని మాట్లాడుతున్నారు పవన్.

తాజాగా నరసాపురం(Narasapuram)లో పవన్ బహిరంగ సభ నిర్వహించగా కొంతమంది ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పవన్ ఫొటోలతో వచ్చారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు అంటూ ప్రభాస్ గురించి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ”ఇక్కడ కొంతమంది ప్రభాస్ గారి ఫోటో చూపించారు. ప్రభాస్ అభిమానులు వచ్చారు. ప్రభాస్ బాహుబలి చేసినా, ఆదిపురుష్ (Adipurush) చేసినా సినిమా రిజల్ట్ ఎలాగైనా ఉండొచ్చు కానీ వాళ్ళు రోజుకి 500 నుంచి 1000 మంది ఒక్కోసారి 2000 మందికి ఉపాధి కలిపిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్స్ వల్ల ఇంతమందికి అన్నం పెడుతున్నారు. సంపాదించిన దానికి ప్రభాస్ ట్యాక్సులు కడుతున్నారు. థియేటర్స్ లో రిలీజయితే సినిమా దానిపైన ఆధారపడ్డవాళ్లు అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు, తినుబండారాలు అమ్ముకునేవాళ్ళు ఇలా ఎంతోమంది ఒక సినిమా వల్ల బతుకుతున్నారు. ప్రభాస్ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాడు” అని అన్నారు.

Bro Movie : పవన్ ‘బ్రో’ అప్డేట్.. త్వరలోనే టీజర్.. లుంగీ కట్టిన మామాఅల్లుళ్ళు..

రెండు రోజుల క్రితం కూడా ప్రభాస్ పాన్ ఇండియా హీరో, నా కంటే పెద్ద హీరో, నా కంటే ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటారు అని కామెంట్స్ చేశారు పవన్. దీంతో ప్రభాస్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.