Pawan Kalyan : మొదటిసారి ఆటో ఎక్కిన పవన్ కుమార్తె ఆద్య.. అదే చివరిసారి..!

ముంబై వీధుల్లో రేణూదేశాయ్, ఆద్య కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని..

Pawan Kalyan : మొదటిసారి ఆటో ఎక్కిన పవన్ కుమార్తె ఆద్య.. అదే చివరిసారి..!

Pawan Kalyan daugter Aadhya auto ride with her mother Renu Desai

Updated On : October 29, 2023 / 9:45 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులు అకీరా నందన్, ఆద్య గురించిన విషయాలు రేణూ దేశాయ్ తన సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్ చేస్తూనే వస్తుంది. తాజాగా ఆమె ఆద్యతో ఉన్న ఒక వీడియోని షేర్ చేసింది. రేణూదేశాయ్ చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ రీసెంట్ గా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రేణూదేశాయ్ తో పాటు ఆద్య కూడా వెంటే వస్తూ మీడియా ముందు కనిపిస్తుంది. తాజాగా ముంబై వీధుల్లో రేణూదేశాయ్, ఆద్య కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోని రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. ఇక ఆ వీడియోకి రేణూదేశాయ్ ఇలా రాసుకొచ్చింది.. “ఆద్య మొదటిసారి ఆటో రిక్షా ఎక్కింది. అలాగే బ్లాక్ అండ్ ఎల్లో టాక్సీ రైడ్ ని కూడా ఫస్ట్ టైం పేస్ చేస్తుంది. అండ్ ఇదే చివరిసారి కూడా. అక్టోబర్ 30 నుంచి బ్లాక్ అండ్ ఎల్లో టాక్సీల సర్వీస్ లు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇక అలాగే రోడ్డు సైడ్ మార్కెట్ లో షాప్పింగ్ ని కూడా ఆద్య మొదటిసారి చేసింది” అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Kajal Aggarwal : ఎన్నో ఎమోషన్స్‌ని.. కార్మికుల ప్రేమతో.. కాజల్ ఎమోషనల్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

కాగా ఈ వారం మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి బయలుదేరుతున్నారు. పవన్ కూడా తన భార్య అన్నాలెజనోవాతో కలిసి ఇటలీ వెళ్ళాడు. ఈ వివాహానికి రేణూదేశాయ్ మాత్రం వెళ్లడం లేదని తెలుస్తుంది. కనీసం అకీరా, ఆద్య అయినా వెళ్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. నవంబర్ 1న ఈ వివాహం జరగబోతుంది.