Pawan Kalyan : నిధి అగర్వాల్‌కు పవన్ కల్యాణ్ మరో ఛాన్స్..!
నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో మరో జాక్‌పాట్ కొట్టేసింది.

Pawan Kalyan give another chance to Nidhhi Agerwal
నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో మరో జాక్‌పాట్ కొట్టేసింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో ఆమె నటన ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. సినిమా రిలీజ్‌కు ముందు, రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్‌లో నిధి చూపించిన డెడికేషన్ పవన్ కల్యాణ్‌ను బాగా ఆకర్షించాయట.
ఒక రోజు 16 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చి, నాన్‌స్టాప్‌గా సినిమా ప్రమోషన్స్‌ను నడిపించిన నిధి, అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కమిట్‌మెంట్ చూసిన పవన్, ఆమెకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ నటిస్తున్న ఓజీ సినిమాలో నిధి అగర్వాల్ ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారట.
సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ కాబోతోంది, ఇప్పటికే షూటింగ్‌లో ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉందని..ఆ స్పెషల్ సాంగ్‌లో నిధి సందడి చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ఓజీ స్పెషల్ సాంగ్ ఆమె కెరీర్‌కు బూస్టింగ్ ఇవ్వడం పక్కా అంటున్నారు. పవన్ ఫ్యాన్స్‌కు ఈ సాంగ్ ఓ స్పెషల్ ట్రీట్‌గా ఉంటుందని, నిధి-పవన్ కెమిస్ట్రీ సినిమాకు మరింత అట్రాక్షన్ తెచ్చి పెడుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
ఈ స్పెషల్ సాంగ్‌తో నిధి మరోసారి టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతుందని, ఈ అవకాశం ఆమెకు మరిన్ని ప్రాజెక్టులకు తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఓజీ సినిమాలో నిధి చేయబోయే స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్‌ను ఊపేయడం పక్కా అంటున్నారు. పవన్ కూడా ఈ స్పెషల్ సాంగ్‌లో ఉంటారా.? లేక నిధి అగర్వాల్ మాత్రమే కనిపిస్తుందా అనేది చూడాలి మరి.