HariHara VeeraMallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రెండు భారీ ఈవెంట్స్.. నార్త్ లో, సౌత్ లో.. ఎక్కడంటే? నార్త్ గెస్ట్ ఎవరో తెలుసా?

హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ రెండు భారీ ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నాం అని తెలిపారు.

HariHara VeeraMallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ రెండు భారీ ఈవెంట్స్.. నార్త్ లో, సౌత్ లో.. ఎక్కడంటే? నార్త్ గెస్ట్ ఎవరో తెలుసా?

Pawan Kalyan HariHara VeeraMallu Movie Unit Plans Two Huge Events in North India and South India

Updated On : May 22, 2025 / 7:17 PM IST

HariHara VeeraMallu : అయిదేళ్లుగా సాగిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తయి రిలీజ్ కాబోతుంది. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇటీవలే ఈ సినిమా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.

హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ రెండు భారీ ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నాం అని తెలిపారు. అయితే టాలీవుడ్ సమాచారం ప్రకారం నార్త్ లో ఒక భారీ ఈవెంట్, సౌత్ లో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తుంది. సౌత్ లో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కచ్చితంగా హాజరవుతారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వస్తారని టాక్ నడుస్తుంది.

Also Read : Jaya Prakash Reddy : జయప్రకాశ్ రెడ్డి కూతురు, అల్లుడు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ.. ఏం చేస్తున్నారో తెలుసా?

ఇక నార్త్ లో కాశీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు అని తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమా ధర్మం కోసం యుద్ధం అనే కాన్సెప్ట్ కాబట్టి కాశీలో ప్రమోషన్ భారీగా చేద్దామని ప్లాన్ చేసారు. అక్కడ జరిగే ఈవెంట్ కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా వస్తారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల జనసేన ఎన్నికల్లో గెలిచి బీజేపీకి బలంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం, మోడీ పవన్ ని నేషనల్ మీడియా ముందు పొంగడంతో నార్త్ లో కూడా పవన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది, బీజేపీ నేషనల్ లీడర్స్ తో మంచి అనుబంధం ఏర్పడింది.

దీంతో యోగి ఆదిత్యనాథ్ లాంటి మాస్ లీడర్ ఈవెంట్ కి వస్తే ప్రమోషన్ భారీగా జరగడంతో పాటు ధర్మం గురించి కూడా ప్రజల్లోకి బాగా వెళ్తుందని భావిస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా మీద ప్లే చేస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. అదే నిజమయితే కనక టాలీవుడ్ నుంచి బుర్జ్ ఖలీఫా మీదకు వెళ్లే మొదటి సినిమా హరిహర వీరమల్లునే. ఈ వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈవెంట్స్ జరగడం పక్కా కానీ మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Kesari Chapter 2 : ‘కేసరి – చాప్టర్ 2’ మూవీ రివ్యూ.. జలియన్ వాలాబాగ్ కేసు.. ఇండియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా..