OG Movie : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో పవన్ కళ్యాణ్.. నెట్టింట పిక్స్ వైరల్..!
OG మూవీ సెట్స్ నుంచి బయటకి వచ్చిన పవన్ పిక్స్ చూశారా..? మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ..

Pawan Kalyan martial arts training pics for OG movie
OG Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాహో డైరెక్టర్ సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ మూవీ OG. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికి మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా దాదాపు 50 శాతం పైగా చిత్రీకరణ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ నాలుగో షెడ్యూల్ జరుగుతుంది. మొన్నటి వరకు పవన్ లేకుండానే ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూ వచ్చింది. తాజాగా పవన్ కూడా ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
Devara : ఒకటి కాదు, రెండు కాదు.. అన్ని యాక్షన్ షెడ్యూల్సే.. దేవర వేట మూమూలుగా లేదుగా..
ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. అందులో పవన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ కనిపిస్తున్నాడు. ఈ పిక్స్ చూసిన పవన్ అభిమానులు మూవీ పై అంచనాలు మరింత పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల పవన్ ఇలా మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న మూవీ స్టిల్స్ బయటకి వచ్చాయి. వాటిలో పవన్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
Pawan Kalyan : వరుసగా మూడుసార్లు 100 కోట్లు మూవీస్.. ఆ క్లబ్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?
Theatre loney Potham ? ##OG ? / #PawanKalyan #TheyCallHimOG / #FireStormisComing pic.twitter.com/871b1ZkiUA
— Vamsivardhan PKVK (@Vamsivardhan_2) July 31, 2023
Everyone will die with #OG Hype ??? pic.twitter.com/UXF03QHCKv
— PSPK Rule™ (@PSPKRule) July 25, 2023
కాగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 90’స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఏపీ ఎలక్షన్స్ బట్టి ఈ మూవీ రిలీజ్ ఆధారపడి ఉంది.