Pawan Kalyan : కొణిదెల బ్యానర్‌లో చరణ్ నిర్మాతగా పవన్ సినిమా.. ఎప్పటికయ్యేనో??

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''మా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పవన్‌ బాబాయ్‌ సినిమా చేయాలి. బాబాయ్ కూడా చేస్తా అన్నారు. ఆయన బ్యానర్‌ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో..............

Pawan Kalyan :  కొణిదెల బ్యానర్‌లో చరణ్ నిర్మాతగా పవన్ సినిమా.. ఎప్పటికయ్యేనో??

Pawan

Updated On : April 25, 2022 / 9:10 AM IST

Ram Charan :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. సినిమా రిలీజ్ కి ఇంకో నాలుగు రోజులే ఉండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ”మా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పవన్‌ బాబాయ్‌ సినిమా చేయాలి. బాబాయ్ కూడా చేస్తా అన్నారు. ఆయన బ్యానర్‌ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో నేను కూడా సినిమా చేయాలి అనే ఆలోచన ఉంది” అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలకి మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. చరణ్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమా ఉంటే ఇంకా అదిరిపోతుంది భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కాంబినేషన్ కష్టమే అనిపిస్తుంది.

Hridayanath Mangeshkar : ఆసుపత్రిలో లతా మంగేష్కర్ సోదరుడు..

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తవ్వడానికే చాలా సమయం పడుతుంది. అంతేకాక ఏపీ ఎలక్షన్స్ కి సమయం దగ్గర పడుతుండటంతో పవన్ ఓ రెండు సినిమాల షూటింగ్స్ ని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి చేసి రెండు సంవత్సరాలు పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాలని భావిస్తున్నారు. ఇక ఎలక్షన్ రిజల్ట్ బట్టి తన తర్వాతి సినిమాల గురించి ఆలోచిస్తారు పవన్. ఇలా చేసినా పవన్ ఒప్పుకున్న సినిమాల్లోనే ఒకటి ఆగిపోద్ది. ఇంక చరణ్ నిర్మాతగా కొణిదెల బ్యానర్ లో సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి మరి.

Acharya : కాజల్‌ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం పేరు కూడా పలకట్లేదు?

అయితే పవన్ కళ్యాణ్ బ్యానర్ లో మాత్రం చరణ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి చాలా సమయం పట్టొచ్చు. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరో సినిమా కూడా ఓకే అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూడు సినిమాలు అయ్యాక పవన్ బ్యానర్ లో చరణ్ సినిమా చేసే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మెగా అభిమానులు మాత్రం హ్యాపీనే.