Pawan Kalyan : పవన్ మరో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడా.. ఏ దర్శకుడితో?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరి హర వీరమల్లు పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాని కూడా పట్టాలు ఎక్కించబోతున్నాడని తెలుస్తుంది.

Pawan Kalyan movie with Sudheer Varma starts soon
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. ఆల్రెడీ వినోదయ సిత్తం రీమేక్ PKSDT చిత్రం షూటింగ్ పూర్తి చేసిన పవన్.. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో పాల్గొన్నాడు. ఎనిమిది రోజుల పాటు షూటింగ్ చేసి మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలయ్యే గ్యాప్ లో OG మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. నిన్ననే (ఏప్రిల్ 15) OG షూటింగ్ ముంబైలో మొదలైంది. వచ్చే వారం నుంచి పవన్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనున్నాడట.
OG Movie: షూటింగ్ స్టార్ట్స్.. రికార్డులను పాతరపెట్టేందుకు వస్తోన్న OG..!
ఇక ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్ చివరి దశలో ఉంది. మే చివరి వారంలో పవన్ ఈ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. సురేందర్ రెడ్డి, సుధీర్ వర్మ దర్శకులతో చెరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండిటిలో సుదీర్ వర్మ సినిమా త్వరలో పట్టాలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ చెప్పిన ఒక లైన్ పవన్ కి నచ్చడంతో దానిని సుదీర్ వర్మ ఇంప్రూవ్ చేస్తున్నాడు.
ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుదీర్ వర్మనే తెలియజేశాడు. తాజాగా కథ కూడా ఫైనలైజ్ అయ్యిందట. దీంతో ఈ సినిమాని కూడా పూర్తి చేసేసే ఆలోచన చేస్తున్నాడట పవన్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ వార్త విన్న పవన్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సుదీర్ వర్మ రావణాసుర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేక పోయింది. ఈ విషయం గానే పవన్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించడం లేదు.