Unstoppable : 20 ఏళ్ళ తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించిన పవన్..

పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు పిచ్చి అన్న సంగతి తెలిసిందే. పవన్ పుస్తకాలు బాగా చదువుతారు. అంతే కాకుండా ఆ పుస్తకాలలో మాటలని అప్పుడప్పుడు తన స్పీచ్ లలో వాడుతూ ఉంటారు. ఎక్కువగా గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాలు, ఆయన రాసిన ఆధునిక మహాభారతం పుస్తకంలోని వ్యాఖ్యలను...................

Unstoppable : 20 ఏళ్ళ తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించిన పవన్..

Pawan Kalyan re print the book Adhunika Mahabharatham written by gunturu seshendra sharma after 20 years

Updated On : February 10, 2023 / 1:55 PM IST

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు పిచ్చి అన్న సంగతి తెలిసిందే. పవన్ పుస్తకాలు బాగా చదువుతారు. అంతే కాకుండా ఆ పుస్తకాలలో మాటలని అప్పుడప్పుడు తన స్పీచ్ లలో వాడుతూ ఉంటారు. ఎక్కువగా గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాలు, ఆయన రాసిన ఆధునిక మహాభారతం పుస్తకంలోని వ్యాఖ్యలను చెప్తూ ఉంటాడు పవన్. గతంలో ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పవన్ రీ ప్రింట్ చేయించారు. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Unstoppable : బాలకృష్ణ తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ పై ట్రోలింగ్.. స్పందించిన బాలయ్య..

ఈ షోలో బాలకృష్ణ దీని గురించి మాట్లాడుతూ గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం పుస్తకంలోనివి నువ్వు బాగా మాట్లాడతావు, ఆ పుస్తకాన్ని రీప్రింట్ కూడా వేయించావు ఎందుకు అని అడగగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గుంటూరు శేషేంద్ర శర్మ రచనలలో నా ప్రశ్నలకు సమాధానాలు కనిపించాయి. ఇప్పటి జీవితాలు, ప్రజల కష్టాలు అయన రచనల్లో బాగా కనిపిస్తాయి. నాకు త్రివిక్రమ్ గారు ఆయన పుస్తకాలని పరిచయం చేశారు. ఆ పుస్తకం ఇండియా నుంచి నోబెల్ కు కూడా షార్ట్ లిస్ట్ అయింది. అయితే ఈ పుస్తకం ఎక్కువ దొరకలేదు. ఉన్న కొన్ని పుస్తకాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఫస్ట్ ప్రింట్ చేయించారు. ఆ తర్వాత మళ్ళీ చేయించలేదు. దీంతో వాళ్ళ అబ్బాయి దగ్గర ఒక పాత బుక్ ఉందంటే ఆయనతో మాట్లాడి పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించాను. అలాంటి కవిని కొత్త తరానికి పరిచయం చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను సంతోషించాను. అలాంటి కవి రాసినవి ఇప్పటి తరానికి తెలియాలి. అందుకే ఆ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించాను అని తెలిపారు.