Pawan Kalyan : అందరూ పవన్ కళ్యాణ్ ని సాయం అడుగుతుంటే.. అతన్ని సాయం కోరిన పవన్..

అడక్కుండానే ఎదుటివారి కష్టం గుర్తించి సాయం చేసే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటిది పవన్ కళ్యాణ్ ఒకర్ని సాయం అడిగారు.

Pawan Kalyan : అందరూ పవన్ కళ్యాణ్ ని సాయం అడుగుతుంటే.. అతన్ని సాయం కోరిన పవన్..

Pawan Kalyan

Updated On : July 4, 2025 / 6:34 AM IST

Pawan Kalyan : ఒక స్టార్ హీరోగా, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎంతోమందికి సాయం చేస్తూనే ఉంటారు. చాలా మంది సాయం చేయమని పవన్ ని వేడుకుంటారు. అడక్కుండానే ఎదుటివారి కష్టం గుర్తించి సాయం చేసే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటిది పవన్ కళ్యాణ్ ఒకర్ని సాయం అడిగారు.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ జూన్ 3న రిలీజయింది. ఈ ట్రైలర్ మొదట్లో తమిళ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఉంది. అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ OG సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు.

Also Read : Producer Satish : ఎన్టీఆర్ బామ్మర్దితో త్వరలో సినిమా.. నేను, నాని కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాం.. సోలో బాయ్ నిర్మాత కామెంట్స్..

మొదట అర్జున్ దాస్ హరిహర వీరమల్లు ట్రైలర్ షేర్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ గారు ఆయన మూవీ ట్రైలర్ కి నా వాయిస్ ఇమ్మని అడిగినప్పుడు ఏమి అడగకుండా ఎస్ అని చెప్పాను. ఇది మీ కోసం సర్ అని తెలిపాడు. అర్జున్ దాస్ చేసిన ట్వీట్ కి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ.. డియర్ బ్రదర్ అర్జున్ దాస్ నేను నీకు కృతజ్ఞుడిని అయి ఉంటాను. చాలా అరుదుగా నేను సాయం అడుగుతాను. నేను అడిగినదాన్ని చేసినందుకు ధన్యవాదాలు. నీ వాయిస్ లో మ్యాజిక్ ఉంది అంటూ ట్వీట్ చేసారు.

పవన్ ట్వీట్ కి అర్జున్ దాస్ రిప్లై ఇస్తూ.. పవన్ కళ్యాణ్ సర్ ఈ మెసేజ్ నాకు ఎంత గొప్పదో మీకు తెలీదు. మీరు చాలా అరుదుగా సహాయం కోరే వ్యక్తి అని నాకు తెలుసు. ఆ అరుదైన సందర్భాలలో మీరు నన్ను ఎంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ విషయానికి వస్తే నేను మీకు ఎప్పుడూ ఒక కాల్ లేదా మెసేజ్ దూరంలో ఉంటాను అని తెలిపాడు. దీంతో పవన్, అర్జున్ దాస్ ట్వీట్స్ వైరల్ గా మారాయి. పవన్ లాంటి వ్యక్తి అర్జున్ దాస్ ని సాయం అడగడమే కాక, సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టడంతో అంతా పవన్ ని మరోసారి అభినందిస్తున్నారు.

Also Read : Uppu Kappurambu : ‘ఉప్పు కప్పురంబు’ మూవీ రివ్యూ.. స్మశానంలో స్థలం కోసం గొడవలు..