Bro Movie : పవన్ ‘బ్రో’ అప్డేట్.. త్వరలోనే టీజర్.. లుంగీ కట్టిన మామాఅల్లుళ్ళు..

తాజాగా ఈ సినిమా నుంచి దర్శకుడు సముద్రఖని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బ్రో టీజర్ త్వరలోనే రిలీజ్ చేస్తామని, టీజర్ అప్డేట్ కూడా ఇస్తామని ప్రకటించారు.

Bro Movie : పవన్ ‘బ్రో’ అప్డేట్.. త్వరలోనే టీజర్.. లుంగీ కట్టిన మామాఅల్లుళ్ళు..

Pawan Kalyan Saidharam Tej Bro Movie Teaser update

Updated On : June 27, 2023 / 10:31 AM IST

Bro Teaser update :  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్‌(Sai Dharam Tej) క‌లిసి న‌టిస్తున్న సినిమా ‘Bro’. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన వినోద‌య సితం(Vinodaya Sitham) సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. సముద్రఖని(Samuthirakani) ద‌ర్శ‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇప్ప‌టికే బ్రో సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్యక్రమాలు జరుపుకుంటుందని చిత్రయూనిట్ తెలిపారు. ఇక బ్రో సినిమాను జులై 28న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి దర్శకుడు సముద్రఖని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బ్రో టీజర్ త్వరలోనే రిలీజ్ చేస్తామని, టీజర్ అప్డేట్ కూడా ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుంగీ కట్టి స్టైల్ గా నిల్చున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ది లేటెస్ట్ ఫోటో అయినా, పవన్ ది మాత్రం ఇది పాత సినిమాలోని ఫోటో అని అంటున్నారు. తమ్ముడు సినిమాలో ఓ సాంగ్ లో పవన్ ఈ గెటప్ తో కనిపిస్తాడు, దీంతో అదే ఫోటో అని భావిస్తున్నారు. డిజైనింగ్ లో ఇలా పక్క పక్కన పెట్టి పోస్టర్ చేశారేమో అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. లేదా నిజంగానే సినిమాలో పవన్ తో లుంగీ కట్టించారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Tamannaah : అభిమాని చేతిపై తమన్నా టాటూ.. ఎమోషనల్ అయిన తమన్నా..

పవనే బ్రో టీజర్ త్వరలో వస్తుందని ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క పవన్ తన వారాహి యాత్రలో బిజీగా ఉన్నాడు.