Pawan – Akira : ప్రభాస్ సాంగ్స్ వింటూ జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తున్న పవన్ కొడుకు అకీరా.. వీడియో వైరల్!
రేణు దేశాయ్ అకీరా నందన్ కి సంబంధించిన జిమ్ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో అకీరా ప్రభాస్ సాంగ్స్ వింటూ జిమ్‌లో..

Pawan Kalyan Son Akira Nandan doing gym of listening Prabhas songs
Pawan Kalyan – Akira : పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ల ముద్దుల కొడుకు, జూనియర్ పవర్ స్టార్ ‘అకీరా నందన్’ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అకీరా బయట పెద్దగా కనిపించడు. కానీ రేణుదేశాయ్ అతనికి సంబందించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అకీరా పియానో ప్లే చేసేది, మార్షల్ ఆర్ట్స్ చేసేవి షేర్ చేస్తూ వస్తుంది. ఇక అకీరాలోని ఈ టాలెంట్స్ తో.. సినిమాలో ఎంట్రీ ఇవ్వకుండానే ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
Tamannaah : విజయ్‌కే తన మొదటి ముద్దు ఇచ్చాను అంటున్న తమన్నా..
ఇది ఇలా ఉంటే, రేణుదేశాయ్ తాజాగా అకీరాకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో అకీరా జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నాడు. అకీరా బ్యాక్ నుంచి కనిపిస్తుండగా టి షర్ట్ పై ఆంజనేయ స్వామి బొమ్మ కనిపిస్తుంది. కాగా మనలో చాలా మంది వర్క్ అవుట్స్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలోని ‘ట్రావెలింగ్ సోల్జర్’ సాంగ్ ని బాగా వింటుంటాం. కానీ పవన్ తనయుడు అకీరా.. ప్రభాస్ సాంగ్ వింటున్నాడు. బాహుబలి 2 సినిమాలోని ‘ఒక ప్రాణం’ అనే సాంగ్ ని వింటున్నాడు.
Sai Dharam Tej : రామ్‌చరణ్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా.. నిజమేనా..?
ఇక ఈ వీడియో పోస్ట్ చేస్తూ రేణుదేశాయ్ ఇలా రాసుకొచ్చింది. “జిమ్ చేసేటప్పుడు అర్ధంలేని ఇంగ్లీష్ పాటలు వినకుండా మన తెలుగు మరియు హిందీ పాటలు వింటునందుకు చాలా గర్వంగా ఉంది మై లిటిల్ బాయ్” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా అకీరా త్వరలోనే సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అకీరా ఎంట్రీ బాధ్యత మొత్తం రామ్ చరణ్ తీసుకున్నాడట. మరి ఈ జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి.
View this post on Instagram