Pawan Kalyan : గద్దర్ జయంతి నాడు పవన్ ప్రత్యేక ట్వీట్.. అన్న నువ్వు గాయపడ్డ పాటవి..

ప్రజాగాయకుడు గద్దర్ ని ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్.. ఆయన జయంతి నాడు ప్రత్యేక ట్వీట్ చేశారు. తన స్వరంతో ఓ వీడియో చేసి నివాళులు అర్పించారు.

Pawan Kalyan : గద్దర్ జయంతి నాడు పవన్ ప్రత్యేక ట్వీట్.. అన్న నువ్వు గాయపడ్డ పాటవి..

Pawan Kalyan tribute tweet on Gaddar birthday

Updated On : January 31, 2024 / 8:12 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ప్రజాగాయకుడు గద్దర్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గద్దర్‌ని అన్న అంటూ పవన్ ఎంతో ఆప్యాంగా పిలుస్తూ తన ప్రేమని చాటుకుంటుంటాడు. గత ఏడాది గద్దర్ చనిపోయినప్పుడు పవన్ చాలా ఎమోషనల్ అయ్యారు, కన్నీరు పెట్టుకున్నారు. తన సోషల్ మీడియాలో గద్దర్ పై పోస్టులు వేసి అన్న పై తనకెంతటి అభిమానం ఉందో అందరికి తెలియజేశారు.

ఇక నేడు జనవరి 31న గద్దర్ పుట్టినరోజు కావడంతో.. పవన్ ఆయనని తలుచుకుంటూ ఒక ప్రత్యేక ట్వీట్ చేశారు. “అన్న నువ్వు గాయపడ్డ పాటవి. కానీ ప్రజల గాయానికి కట్టుబడ్డ పాటవి. అన్యాయం పై తిరగబడ్డ పాటవి. ఇది వరకు నువ్వు ధ్వనించే పాటవి. ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. తీరం చేరిన ప్రజా యుద్ధనౌకకి జోహార్” అంటూ పవన్ తన స్వరంతో ఓ వీడియో చేసి నివాళులు అర్పించారు.

Also read : Game Changer – OG : సెప్టెంబర్‌లో బాబాయ్, అబ్బాయి పోటీ ఉంటుందా.. ఓజి కోసం గేమ్ ఛేంజర్ వాయిదా..!

ఈ పోస్టు పై గద్దర్ అభిమానులు, పవన్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతూ.. నివాళులు అర్పిస్తున్నారు. కాగా పవన్ కి గద్దర్ అంటే ఎంత ఇష్టమో, గద్దర్ కి కూడా పవన్ అంటే అంతే ఇష్టం. పవన్ కళ్యాణ్ ని సొంత తమ్ముడిగా భావిస్తారు గద్దర్. ఈ విషయానికి గద్దర్ అనేక సందర్భాల్లో తెలియజేశారు. తాను ఏదైనా కష్టంలో ఉన్నా, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. పవన్ దగ్గరకి వెళ్లి నేరుగా ఆయన జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకునే వాడినని, పవన్ తో తనకి అంతటి చనువు ఉందని గద్దర్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.

గద్దర్ మరణం తరువాత కూడా పవన్.. గద్దర్ కుటుంబానికి అంతే అండగా నిలుస్తానని కూడా పేర్కొన్నారు. కాగా గత ఏడాది ఆగస్టులో గద్దర్‌కు గుండెపోటు వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అక్కడ దాదాపు 10 రోజులు పాటు చికిత్స పొందిన గద్దర్.. ఆగష్టు 6న 77 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.