Pushpa 2 : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నుంచి ‘పీలింగ్స్ ప్రొమో’ రిలీజ్..
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.

PEELINGS Song Promo From Pushpa 2 The Rule
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ‘పీలింగ్స్’ అనే పాట ప్రొమోను విడుదల చేసింది.
ఇక పూర్తి పూట డిసెంబర్ 1న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పాట పల్లవి లిరిక్స్ మలయాళంలో ఉన్నాయి. అన్ని భాషల్లోనూ ఈ పాట రిలిక్స్ మలయాళంలోనే ఉంటాయని కేరళ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చెప్పిన సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీ మేక్సర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మంధాన కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.