Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. రూ. 20వేల లోపు ధరలో 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఏదైనా కొనేసుకోండి..!

Amazon Great Indian Festival : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా అద్భుతమైన కెమెరాలతో 6 బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

1/7Amazon Great Indian Festival
Amazon Great Indian Festival : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. అంతకన్నా ముందుగానే ప్రారంభ డీల్స్ కింద అనేక స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా రూ. 20వేల లోపు 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. స్టైలిష్ డిజైన్‌లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఈ లిమిటెడ్ టైమ్ డీల్స్ ముగిసేలోపు మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
2/7Oppo A5 Pro
ఒప్పో A5 ప్రో : మీడియాటెక్ డైమెన్సిటీ 6300తో నడిచే ఒప్పో A5 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఎల్‌సీడీ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP+2MP డ్యూయల్ మెయిన్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ షూటర్, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ ఇప్పుడు రూ. 17,998కి మాత్రమే లభ్యమవుతుంది.
3/7vivo y39
వివో Y39 : వివో Y39 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 6.68-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 50MP+2MP డ్యూయల్ మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 44W టర్బో ఛార్జింగ్ ద్వారా సపోర్టుతో 6500mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు ప్రారంభ డీల్స్‌లో ఈ వివో ఫోన్ కొనుగోలుదారులకు కేవలం రూ. 16,999 ధరకే లభిస్తుంది.
4/7iQOO Z10 Lite
ఐక్యూ జెడ్10 లైట్ : ఐక్యూ జెడ్10ఎక్స్ ఫోన్ 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6500mAh బ్యాటరీ, 50MP+2MP డ్యూయల్ ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. అమెజాన్ సేల్‌కు ముందే ఈ ఐక్యూ ఫోన్ రూ. 9,998కి కొనేసుకోవచ్చు.
5/7Honor 200
హానర్ 200 : హానర్ 200లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ మొబైల్ యూనిట్ 5200mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP+50MP+12MP బ్యాక్ కెమెరా సెటప్, 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ డీల్స్ ద్వారా రూ. 19,998కి కొనుగోలు చేయొచ్చు.
6/7Realme Narzo 80x Pro
రియల్‌మి నార్జో 80x ప్రో : రియల్‌మి నార్జో 80x ప్రో 6.7-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్‌ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్ట్ అందించే 6000mAh టైటాన్ బ్యాటరీ, డ్యూయల్ 50MP+2MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా కలిగి ఉంది. ఈ లిమిటెడ్ ఆఫర్ ద్వారా రియల్‌మి ఫోన్ రూ. 17,498కి కొనుగోలు చేయొచ్చు.
7/7OnePlus Nord CE4
వన్‌ప్లస్ నార్డ్ CE4 : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. డ్యూయల్ 50MP+8MP మెయిన్ కెమెరా, 16MP సెల్ఫీ షూటర్, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. ప్రారంభ డీల్స్ కింద ఈ ఫోన్ కేవలం రూ.19,499 ధరకే లభ్యమవుతుంది.