R Narayana Murthy : అల్లు అర్జున్ ‘పుష్ప’పై ఆర్. నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు.. తగ్గేదేలే..

తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మరోసారి పుష్ప సినిమా గురించి ప్రస్తావించారు.

R Narayana Murthy : అల్లు అర్జున్ ‘పుష్ప’పై ఆర్. నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు.. తగ్గేదేలే..

People's Star R Narayana Murthy Comments on Pushpa and Allu Arjun

Updated On : March 14, 2024 / 11:16 AM IST

R Narayana Murthy : అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప సినిమాకు కలెక్షన్స్, బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్, నేషనల్ అవార్డు.. ఇలా అన్ని ఒకే సినిమాతో వచ్చాయి. పుష్ప సినిమా డైలాగ్స్, సాంగ్స్ ఇప్పటికి కూడా వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దీంతో రాబోయే పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక అల్లు అర్జున్ పై, పుష్ప సినిమాపై గతంలో చాలామంది సెలబ్రిటీలు మాట్లాడుతూ అభినందించారు. ఆర్ నారాయణమూర్తి గతంలో కూడా పుష్ప సినిమాని అభినందించారు. తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మరోసారి పుష్ప సినిమా గురించి ప్రస్తావించారు. సాయిరామ్ శంకర్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ‘వెయ్ దరువెయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ఆర్ నారాయణమూర్తి ఆ సినిమా గురించి మాట్లాడుతూ, ఆ సినిమాని పుష్పలాగా హిట్ అవ్వాలంటూ.. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారు ప్రపంచాన్ని తగ్గేదేలే అంటూ దడదడలాడించేశారు. మన అందరం కూడా ఆయన్ని తగ్గేదేలే అంటూ ఇమిటేట్ చేసాము అని అన్నారు.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు ఇకపై యాడ్స్ చేయడా? ఆ సినిమా కోసమే ఈ డెసిషన్..?

దీంతో ఆర్ నారాయణమూర్తి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా బన్నీ అభిమానులు మరింత షేర్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. ఇటీవలే ఈ షూట్ నిమిత్తం అల్లు అర్జున్ వైజాగ్ వెళ్ళాడు. ఈ సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్.