Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు
సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్.. రూమర్లకు చెక్ పెట్టాలంటే నాగ చైతన్య స్టేట్‌మెంట్ ఇవ్వాలి అంటున్నాడు..
Samantha – Preetham Jukalker: గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా, ఏ సోషల్ మీడియా లేదా మీడియా ఛానెల్ చూసినా నాగ చైతన్య – సమంతల విడాకుల వ్యవహారానికి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. భార్యభర్తలుగా విడిపోయినా కానీ తమ మధ్య స్నేహ బంధం కొనసాగుతుందని చై-సామ్ చెప్పినా కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు.
Samantha : ప్రీతమ్, సమంతను ఏమని పిలుస్తాడో తెలుసా?..
అయితే వాళ్లిద్దరూ విడిపోవడానికి సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ కారణం అంటూ అతగాణ్ణి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ కూడా వివరణ ఇచ్చింది.
Samantha : ‘సాకీ’ లో అక్కినేని ఉందిగా.. సమంత పేరు మారుస్తుందా?
రీసెంట్‌గా ఈ విషయం గురించి ప్రీతమ్ మాట్లాడుతూ.. ‘సమంతను నేను జీజీ (చెల్లి) అని పిలుస్తానని చాలా మందికి తెలుసు.. అలాంటిది ఆమెకి ఐలవ్యూ ఎలా చెప్తాను?.. మా మధ్య ఉన్నది ఎలాంటి రిలేషన్ అనేది నాగ చైతన్యకు కూడా తెలుసు.. నేను సామ్ కెరీర్ నాశనం చేశానంటూ బ్లేమ్ చేస్తున్నారు. దీని గురించి నాగ చైతన్య అఫీషియల్‌గా ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది.. ఎవరెన్ని అనుకున్నా సమంతకు అన్నివేళలా నేను తోడుగా ఉంటాను’ అన్నాడు.
View this post on Instagram