PKSDT: ఫ్యాన్స్ గెట్ రెడీ అంటోన్న పవన్-తేజ్ మూవీ మేకర్స్.. వరుస అప్డేట్స్‌తో దద్దరిల్లాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

PKSDT Makers To Deliver Bombarding Updates
PKSDT: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొద్దిరోజులకే షూటింగ్ కూడా మొదలుపెట్టడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ముగించేసుకున్నాడని తెలుసుకుని అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
PKSDT : వినోదయ సిత్తం షూటింగ్ పూర్తి చేసిన పవన్..
అయితే, ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాల్సిందిగా మేకర్స్‌ను అభిమానులు వరుసగా కోరుతున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు అభిమానులకు ఓ తీయటి వార్తను ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా నుండి వరుస బాంబులు పేలనున్నాయని.. అప్డేట్స్‌తో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
#PKSDT Movie : పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం.. గ్యాలరీ..
దీంతో పవన్, తేజ్ ఫ్యాన్స్ ఈ సినిమా నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని మరింత ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.
Bombarding updates on the way❤️??? @its___lucky#PKSDT https://t.co/e806SHH1bl
— People Media Factory (@peoplemediafcy) April 8, 2023