PM Modi – DSP : అమెరికాలో స్టేజిపై మన దేవిశ్రీ ప్రసాద్ ని హత్తుకున్న ప్రధాని మోదీ.. పుష్ప శ్రీవల్లి పాటతో..

స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినందించారు.

PM Modi – DSP : అమెరికాలో స్టేజిపై మన దేవిశ్రీ ప్రసాద్ ని హత్తుకున్న ప్రధాని మోదీ.. పుష్ప శ్రీవల్లి పాటతో..

PM Modi Appreciated Music Director Devi Sri Prasad in America Event

Updated On : September 23, 2024 / 9:03 AM IST

PM Modi – DSP : ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సు ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో అనేకమంది ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వగా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు.

Also Read : NTR – Devara : ఇక తెలుగులో ‘దేవర’ ప్రమోషన్స్ లేనట్టే.. అమెరికాకు చెక్కేసిన ఎన్టీఆర్..

అనంతరం దేవి శ్రీ ప్రసాద్, హనుమాన్‌కైంద్, ఆదిత్య గాధ్వి.. హర్ ఘర్ తిరంగా పాట పాడుతూ ప్రధాని మోదీకి స్టేజిపైకి ఆహ్వానం పలికారు. స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినందించారు. దేవితో పాటు స్టేజిపై ఉన్న మిగిలిన కళాకారులను కూడా దగ్గరకు తీసుకొని మోదీ అభినందించారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అమెరికాలో ప్రవాస భారతీయుల ఈవెంట్లో స్టేజిపై మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని ప్రధాని మోదీ అభినందించడం విశేషం.

ఈవెంట్ అయ్యాక కూడా మోదీ ప్రత్యేకంగా తనని అభినందించారు అని, షేక్ హ్యాండ్ ఇచ్చారని, ఆయనతో కలిసి సెల్ఫీ దిగాను అని, నాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది అని దేవి శ్రీ ప్రసాద్ అక్కడి మీడియాతో తెలిపారు.