Ponniyin Selvan 2 : రెండు రోజుల్లో 100 కోట్ల మార్క్ క్రాస్.. తమిళ్ తరువాత ఆ స్టేట్ లోనే టాప్ కలెక్షన్స్!

బాక్స్ ఆఫీస్ వద్ద పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం రెండు రోజులోనే 100 కోట్లకు పై కలెక్షన్స్ రాబట్టిన PS2 తమిళ్ తరువాత ఆ భాషలో..

Ponniyin Selvan 2 : రెండు రోజుల్లో 100 కోట్ల మార్క్ క్రాస్.. తమిళ్ తరువాత ఆ స్టేట్ లోనే టాప్ కలెక్షన్స్!

Ponniyin Selvan 2 collections cross 100 crores mark in just 2 days

Updated On : April 30, 2023 / 4:17 PM IST

Ponniyin Selvan 2 : తమిళ నవల ఆధారంగా భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). ఈ కథని కమల్ హాసన్ తో పాటు కోలీవుడ్ లోని పలువురు బడా దర్శకులు తెరకెక్కించడానికి ప్రయత్నించారు గాని వీలు కాలేదు. చివరిగా ఈ నవలని స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమాగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి మంచి విజయానే అందుకుంది.

Sobhita – Aishwarya : పొన్నియిన్ భామల లాస్ట్ డే ఫన్నీ మూమెంట్స్.. వీడియో వైరల్!

అయితే తమిళ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినంతగా ఈ సినిమా ఇతర భాష ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా సెకండ్ పార్ట్ రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ మూవీ కలెక్షన్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 100 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే రెండో భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మణిరత్నం తన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడని చెబుతున్నారు.

Salman Khan : తండ్రి కావాలనుకుంటున్నా.. పెళ్లి పై సల్మాన్ కామెంట్స్..

మొదటిరోజు 38 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు పూర్తి అయ్యేసరికి దాదాపు 110 కోట్ల వరకు కాలేచ్ట్ చేసినట్లు సమాచారం. తమిళంలో ఈ సినిమాకి 34.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఆ తరువాత కన్నడలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటకలో 7.80 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.85 కోట్లు, కేరళలో 5.10 కోట్లు, మిగిలిన రాష్ట్రాల్లో మొత్తం కలిపి 6.40 కోట్లు వచ్చాయి. ఓవర్ సీస్ లో 51 కోట్లు కలెక్ట్ చేసింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల వరకు రాబట్టింది. ఇప్పుడు PS2 స్పీడ్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ ని ఈజీగా ఓవర్ టేక్ చేసే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు.

Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..

కాగా ఈ సినిమాలో విక్రమ్(Vikram), కార్తీ(Karthi), జయం రవి(Jayam Ravi), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), త్రిష(Trisha), శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, జయరాం.. వంటి తరమణులు కలిసి నటించారు. ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి.