Ponniyin Selvan 2 : నేటి నుంచే ఓటీటీలో పొన్నియిన్ సెల్వన్ 2.. ఎందులోనో తెలుసా?

థియేటర్స్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసిన పొన్నియిన్ సెల్వన్ 2 ఇటీవల కొన్ని రోజుల క్రితం రెంటల్ పద్దతిలో అమెజాన్ ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఆ రెంటల్ పద్ధతి లేకుండానే అమెజాన్ ఓటీటీలోకి వచ్చేసింది పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా.

Ponniyin Selvan 2 : నేటి నుంచే ఓటీటీలో పొన్నియిన్ సెల్వన్ 2.. ఎందులోనో తెలుసా?

Ponniyin Selvan 2 movie streaming in Amazon Prime OTT from June 2

Updated On : June 2, 2023 / 9:20 AM IST

Ponniyin Selvan 2 :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) పార్ట్ 2 ఏప్రిల్ 28న పాన్ ఇండియా(Pan India) రిలీజయింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో పోలిస్తే ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఒకప్పుడు తమిళనాడుకి పాలించిన చోళులు, పాండ్యులు కథలో రాజరాజ చోళుని కథే పొన్నియిన్ సెల్వన్ సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సినిమా కలెక్షన్స్ అంత భారీగా రాకపోయినా పర్వాలేదనిపించింది.

థియేటర్స్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసిన పొన్నియిన్ సెల్వన్ 2 ఇటీవల కొన్ని రోజుల క్రితం రెంటల్ పద్దతిలో అమెజాన్ ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఆ రెంటల్ పద్ధతి లేకుండానే అమెజాన్ ఓటీటీలోకి వచ్చేసింది పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా. అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉన్నవాళ్ళంతా కుడా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో చూడొచ్చు.

Sobhita Dhulipala : సౌత్ వర్సెస్ నార్త్ గొడవ ఇప్పటిదేం కాదు.. ఎప్పట్నుంచో ఉంది.. కానీ

నేడు జూన్ 2 తెల్లవారుజాము నుంచే పొన్నియిన్ సెల్వన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మరి ఓటీటీల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాను ఓటీటీల్లో చూడటానికి సిద్ధమైపోయారు.