Pooja Hegde : ‘బుట్టబొమ్మ’కు ఏమైంది.. సినిమాలు జారిపోతున్నాయా? వదిలేసుకుంటుందా?

మూడేళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. సౌత్ లోని స్టార్ హీరోలు అందరితోనూ ఆల్మోస్ట్ సినిమాలు చేసింది. అయితే 2022 నుంచి ఈమె కెరీర్ లో హిట్టు అనే మాటే వినిపించడం లేదు.

Pooja Hegde : ‘బుట్టబొమ్మ’కు ఏమైంది.. సినిమాలు జారిపోతున్నాయా? వదిలేసుకుంటుందా?

Pooja Hegde career in doubt no movies in hand focus on bollywood

Pooja Hegde : నిన్న మొన్నటి వరకూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇటు చిన్న హీరోలు, అటు పెద్ద హీరోలు అందరి సినిమాల్లోనూ బ్యాలెన్సింగ్ గా నటిస్తూ తనకు తిరుగే లేదనిపించుకుంది. మూడేళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. సౌత్ లోని స్టార్ హీరోలు అందరితోనూ ఆల్మోస్ట్ సినిమాలు చేసింది. అయితే 2022 నుంచి ఈమె కెరీర్ లో హిట్టు అనే మాటే వినిపించడం లేదు. 2022 నుంచి 5 సినిమాలు చేస్తే అందులో ఒకటి కూడా హిట్ అవ్వకపోగా అన్నీ ఒక దాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాలు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో కొంతమంది పూజా హెగ్డేను ఇప్పుడు ఐరన్ లెగ్ గా ముద్ర వేశారు.

అయినప్పటికీ పూజా హెగ్డే తనకు ఉన్న ఒకే ఒక హోప్ మహేశ్ బాబు, త్రవిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’ సినిమానే అని భావించింది. అయితే ఈ సినిమా నుంచి హీరోయిన్ గా పూజాని తప్పించారని, కొంతమందేమో ఆమె తప్పుకుందని అంటున్నారు. ఆమె ప్లేస్ లోకి మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ లేదా మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేశారని వార్తలొస్తున్నాయి. ఇదే సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది.

అసలే టాలీవుడ్ లో నెగెటివ్ సెంటిమెంట్ గా మారిన పూజాహెగ్డేను మిగిలిన స్టార్ హీరోలు కూడా యాక్సెప్ట్ చేయడం లేదనే టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే పూజా ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా చేయడం లేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన పూజా చేస్తుంది అని వార్తలు వచ్చినా అధికారిక సమాచారం మాత్రం లేదు.

Guntur Kaaram : ఎట్టకేలకు మొదలైన గుంటూరు కారం షూటింగ్.. మహేష్ బ్యాక్ టు షూటింగ్..

ఇక పూజా హెగ్డే సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. సక్సెస్ లో లేని హీరోయిన్ కు అంత ఇవ్వడం ఎందుకు అనే ఆలోచన కూడా నిర్మాతలలో ఇప్పుడు మొదలైంది. అందుకే పూజాహెగ్డే పారితోషికం తగ్గించుకుంటే తప్ప అవకాశాలు ఇవ్వకూడదు అని నిర్మాతలు నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పూజా బాలీవుడ్ లో ఎక్కువ అవకాశాల కోసం ఫోకస్ చేస్తూ టాలీవుడ్ ని వదిలేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో పూజా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పూజా తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకొని, టాలీవుడ్ పై మళ్ళీ ఫోకస్ పెడుతుందేమో చూడాలి.