Guntur Kaaram : ఎట్టకేలకు మొదలైన గుంటూరు కారం షూటింగ్.. మహేష్ బ్యాక్ టు షూటింగ్..

సినిమా షూటింగ్ వాయిదా పడటం, సినిమా గురించి ఇలా వార్తలు రావడంతో మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించిన సినిమా ఆ టైంకి వస్తుందా లేదా అని భావిస్తున్నారు.

Guntur Kaaram : ఎట్టకేలకు మొదలైన గుంటూరు కారం షూటింగ్.. మహేష్ బ్యాక్ టు షూటింగ్..

Guntur Kaaram Movie shooting starts new schedule Mahesh Joined in shoot

Updated On : June 24, 2023 / 12:16 PM IST

Mahesh Babu :  గత కొన్నిరోజులుగా మహేష్ బాబు గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా వార్తల్లో నిలుస్తుంది. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇప్పటికే వివిధ కారణాల వల్ల పలుసార్లు వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా సినిమా నుంచి తమన్(Thaman), పూజా హెగ్డే(Pooja Hegde) తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. తమన్ వీటిపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్దే మాత్రం సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. పూజా ప్లేస్ లో మరో హీరోయిన్ ని కూడా తీసుకున్నట్టు సమాచారం.

ఇన్నిసార్లు సినిమా షూటింగ్ వాయిదా పడటం, సినిమా గురించి ఇలా వార్తలు రావడంతో మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించిన సినిమా ఆ టైంకి వస్తుందా లేదా అని భావిస్తున్నారు. తాజాగా ఈ సందేహాలన్నిటికి చెక్ పెడుతూ నేటి నుంచి షూటింగ్ మొదలైందని, మహేష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని గుంటూరు కారం ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

Adipurush : హమ్మయ్య.. నేపాల్‌లో ఆదిపురుష్ ఒక్కటే బ్యాన్.. మిగిలిన హిందీ సినిమాలకు ఓకే..

షూటింగ్ సెట్ లో మిరపకాయలతో తీసిన ఓ ఫోటో పోస్ట్ చేసి ఈ ట్వీట్ చేయడంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా షూటింగ్ పూర్తిచేయాలని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఫుల్ మాస కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. 2024 జనవరి 13 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.