Pooja Hegde: ఎట్టకేలకు ఒక్క ఆవకాశం.. పూజకు తెలుగు సినిమా ఛాన్స్.. హీరో ఎవరో తెలుసా?
చాలా గ్యాప్ తరువాత తెలుగు సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న పూజ హెగ్డే.
Pooja Hegde playing female lead role in Srinu Vaitla-Sharwanand movie
- పూజ హెగ్డేకు బంపర్ ఆఫర్
- యంగ్ హీరో సినిమాలో అవకాశం
- త్వరలోనే అధికారిక ప్రకటన
Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజ హగ్దే గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడకన్నా తెలుగులోనే మంచి హిట్స్ అందుకుంది. వరుసగా స్టార్స్ తో సినిమాలు చేసి టాప్ స్టార్ గా ఎదిగింది. కానీ, సడన్ గా ఏమయిందో తెలియదు ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆమె చేసిన చివరి తెలుగు సినిమా రాధే శ్యామ్.
ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తరువాత పూజతో మరో తెలుగు సినిమాను ఒకే చేయలేదు. అయితే, తరువాత మళ్ళీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఇంతకాలానికి మళ్ళీ తెలుగులో నటించే అవకాశం దక్కించుకుంది పూజ. టాలీవుడ్ కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల యంగ్ హీరో శర్వానంద్ తో ఈ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ ఫొటోలు
శ్రీను వైట్ల స్టైల్లోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హగ్దే(Pooja Hegde)ను తీసుకోనున్నారు అనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా గనక ఒకే అయ్యింది అంటే పూజకి మంచి అవకాశం దక్కినట్టే అని చెప్పాలి. శ్రీను వైట్ల సినిమాలో గ్లామర్ కి మంచి స్కోప్ ఉంటుంది. ఆలెక్కన ఈ అమ్మడుకు మంచి అవకాశం లభించినట్టే.
కాబట్టి, ఈ సినిమాలో మరోసారి తన గ్లామర్ తో రెచ్చిపోనుంది పూజ. ఈ సినిమా హిట్ అయితే, మరోసారి పూజ తెలుగులో బిజీగా మారే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. మరి చాలా గ్యాప్ తరువాత పూజ హెగ్డే తెలుగులో చేస్తున్న ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.
