Pooja Hegde : మాల్దీవ్స్ టెన్నిస్ కోర్టులో స్టైలిష్‌గా కష్టపడుతున్న పూజా హెగ్డే.. ఫెదరర్ కోసం అంటూ..
మాల్దీవ్స్ లో తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది పూజా హెగ్డే. ఇంకా మాల్దీవ్స్ లోనే ఉంటూ అక్కడే బీచ్ లలో ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తుంది.

Pooja Hegde Plays Tennis in Maldives Photos goes Viral
Pooja Hegde : తెలుగులో పూజాహెగ్డే వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్ కి చెక్కేసింది. ఇటీవల టాలీవుడ్ లో చేతిలో ఉన్న కొన్ని ఆఫర్లని వదులుకొని పూజా బాగా వైరల్ అయింది. ప్రస్తుతం ఓ బాలీవుడ్(Bollywood) సినిమా చేస్తుంది పూజా హెగ్డే. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్(Maldives) కి చెక్కేసింది ఈ బుట్టబొమ్మ.
మాల్దీవ్స్ లో తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది పూజా హెగ్డే. ఇంకా మాల్దీవ్స్ లోనే ఉంటూ అక్కడే బీచ్ లలో ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తుంది. తాజాగా మాల్దీవ్స్ లోని ఓ టెన్నిస్ కోర్ట్ లో టెన్నిస్ గేమ్ డ్రెస్ వేసుకొని ఆడుతుంది. పూజా స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్న ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇది నీ కోసం ఫెదరర్ అంటూ పోస్ట్ చేసింది.
దీంతో పూజాహెగ్డే టెన్నిస్ గేమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ మరిన్ని ఫోటోలు షేర్ చేస్తుంది పూజా.