Pooaj Hegde: రాఖీ భాయ్‌తో పూజా రొమాన్స్.. నిజం ఇదేనట!

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో దాదాపు అందరు....

Pooaj Hegde: రాఖీ భాయ్‌తో పూజా రొమాన్స్.. నిజం ఇదేనట!

Pooja Hegde To Romance Yash In Next Movie Is A Trash

Updated On : June 18, 2022 / 8:49 PM IST

Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించేసింది. ఇక ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి బీస్ట్ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, పూజా కోసం తెలుగు స్టార్స్‌తో పాటు ఇతర భాషల స్టార్స్ కూడా క్యూ కడుతున్నారు.

Pooja Hegde : సొంత స్టేట్‌లో ఎంట్రీ ఇవ్వనున్న పూజా.. యశ్ సరసన?

ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది ఈ బ్యటీ. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాలి’ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. అయితే తాజాగా కన్నడ హీరో యశ్ నటించబోయే నెక్ట్స్ మూవీలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ యశ్ నటించబోయే నెక్ట్స్ మూవీలో పూజా హెగ్డే నటించడం లేదని తెలుస్తోంది.

Pooja Hegde : పూజాహెగ్డేకి అసౌకర్యం.. అసభ్యంగా ప్రవర్తించిన విమాన సిబ్బంది..

కన్నడ డైరెక్టర్ నార్దన్ దర్శకత్వంలో యశ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదని తెలుస్తోంది. అంటే, యశ్ నెక్ట్స్ మూవీలో పూజా నటించడం లేదని కన్నడ సినీ వర్గాలు క్లారిటీ చేశాయి. మరి యశ్ నెక్ట్స్ మూవీలో ఎవరు హీరోయిన్‌గా సెలెక్ట్ అవుతారో చూడాలి.