Producer SKN : ‘బేబీ’ నిర్మాత మరో సాయం.. కూతురి పెళ్ళికి దాచుకున్న డబ్బులు చెదలు కొట్టేయడంతో..

గత రెండు రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో ఓ పేద కుటుంబం తమ కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బులు రెండు లక్షల రూపాయలను చెదలు పట్టి డబ్బు అంతా నాశనమైపోయింది.

Producer SKN : ‘బేబీ’ నిర్మాత మరో సాయం.. కూతురి పెళ్ళికి దాచుకున్న డబ్బులు చెదలు కొట్టేయడంతో..

Poor People Savings Money Destroyed By Termites Producer SKN Reacts

Updated On : November 20, 2023 / 7:28 AM IST

Producer SKN : గత రెండు రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో ఓ పేద కుటుంబం తమ కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బులు రెండు లక్షల రూపాయలను చెదలు పట్టి డబ్బు అంతా నాశనమైపోయింది. నోట్లు ఏవి కూడా పనికిరాకుండా పోయాయి. ఎన్నో రోజులుగా రోజు వారు పనులకు వెళ్లి ఆ డబ్బు దాచుకున్నామని, ఇప్పుడు ఇలా అయిపొయింది అంటూ ఆ పేద కుటుంబం కన్నీళ్లు పెడుతుంది.

తమ కూతురి కోసం దాచుకున్న డబ్బు ఇలా అయిపోవడంతో ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. వీరి బాధని చూసి పలువురు అయ్యో పాపం అని జాలి చూపిస్తున్నారు. అయితే వీరికి సాయం చేయడానికి బేబీ సినిమా నిర్మాత SKN ముందుకొచ్చారు.

Also Read : Bigg Boss 7 Day 77 : ఎలిమినేషన్స్ విషయంలో నాగ్ నిర్ణయం.. ఈ వారం ఇలా.. వచ్చేవారం అలా..

గతంలోనూ నిర్మాత శ్రీనివాస్ అవసరంలో ఉన్న పలువురికి డబ్బులు సాయం చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో SKN స్పందిస్తూ.. ఇది వినడానికి చాలా బాధగా ఉంది. దాచుకున్న డబ్బులు అలా అయిపోవడం బాధగా ఉంటుంది. ఎవరికైనా వారి కాంటాక్ట్ తెలిస్తే చెప్పండి. నేను వారికి సహాయం చేస్తానని ప్రకటించారు. దీంతో SKN చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వారి వివరాలు SKN దగ్గరికి తెలిసిన వారు పంపాలని, వారికి సాయం అందేలా చూడాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోసారి ఇలా సాయం చేయడానికి ముందుకొచ్చిన SKN ని అభినందిస్తున్నారు.