Posani Krishna Murali : నేను చచ్చిపోతే ఇండస్ట్రీ వాళ్లకు నన్ను చూపించొద్దు.. మా ఆవిడ కోసం 50 కోట్ల ఆస్తి పెట్టా.. నేను చచ్చినా పర్లేదు..
పోసాని మురళి కృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రాజకీయం కాకుండా పర్సనల్ విషయాలు, ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో తన ఆస్తి, తన చావు గురించి మాట్లాడుతూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Posani Krishna Murali sensational comments on his life and his property
Posani Krishna Murali : ఇటీవల రాజకీయ వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు పోసాని మురళి కృష్ణ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రాజకీయం కాకుండా పర్సనల్ విషయాలు, ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో తన ఆస్తి, తన చావు గురించి మాట్లాడుతూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోసాని తన చావు గురించి మాట్లాడుతూ.. నాకు ఇప్పుడు ఎలాంటి దిగులు, బాధ లేదు. రేపు ఎవడైనా గొంతు కోసేసినా, నేను సడెన్ గా చచ్చిపోయినా పర్లేదు. మా ఆవిడకు ఏడవొద్దని చెప్పాను. నేను చచ్చిపోతే నా బాడీ ఇండస్ట్రీలో ఎవరికీ చూపించొద్దని, నా మీద ఎవరూ సానుభూతి చూపించొద్దని మా ఆవిడకు చెప్పాను. నేను చచ్చిపోతే ఆమెని, నా పిల్లలని కూడా ఏడవొద్దని చెప్పాను. నాకు 63 ఏళ్ళు, నా భార్యకు 60. నేను చచ్చిపోతే ఎలా ఉండాలో మా ఆవిడను ముందే ప్రిపేర్ చేసి ఉంచాను. ఎవరన్నా చుట్టాలు నన్ను చూడటానికి వస్తే ఇన్నేళ్లు నాతో లైఫ్ ఎలా ఉందో నవ్వుతూ వాళ్లకు చెప్పు అంతేగాని ఏడ్చి గగ్గోలు పెట్టొద్దు అని మా ఆవిడకు చెప్పాను అని తెలిపారు.
ఇక పోసాని తన ఆస్తుల గురించి మాట్లాడుతూ.. నేను బాగానే సంపాదించాను. సడెన్ గా నేను పోతే నా భార్య, పిల్లలు మేమేం చేయాలి అని బాధపడాల్సిన పని లేదు. నా పిల్లలకు కొంత ఆస్తి ఇచ్చేసాను. ఇక నా భార్య పేరు మీద 50 కోట్ల ఆస్తి, క్యాష్ రాసి ఉంచేసాను. నెలకు దాని పై దాదాపు 8 లక్షలు వస్తాయి. ఆ డబ్బులతో నా భార్య హాయిగా బతికేస్తుంది. కాబట్టి నేను, తాను డబ్బుల విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. నేను లేకపోయినా నా భార్య హ్యాపీగా బతికేలా అన్ని ఏర్పాట్లు చేశాను అని తెలిపారు. దీంతో పోసాని చెప్పిన విషయాలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు.