Prabhas : ఇలాంటి సినిమాలు చాలా చేయాలి మనం.. ‘దసరా’పై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..

నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా సినిమా బాగుందంటూ అభినందనలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దసరా సినిమాని పొగిడేస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాని ఓ రేంజ్ లో పొగిడేస్తూ పోస్ట్ చేశాడు.

Prabhas : ఇలాంటి సినిమాలు చాలా చేయాలి మనం.. ‘దసరా’పై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..

Prabhas appreciate Nani Dasara Movie

Updated On : April 2, 2023 / 9:24 PM IST

Prabhas :  నాని(Nani) హీరోగా, కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా(Dasara). సినిమా రిలీజయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి భారీ విజయం సాధించింది.

ఇక ఇప్పటికే మూడు రోజుల్లో ఏకంగా 70 కోట్ల కలెక్షన్స్ సాధించి దసరా సినిమా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్, హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాగా దసరా నిలిచింది. దసరా సూపర్ సక్సెస్ పై నానితో పాటు చిత్రయూనిట్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా సినిమా బాగుందంటూ అభినందనలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దసరా సినిమాని పొగిడేస్తున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నాని దసరా సినిమాని అభినందించగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాని ఓ రేంజ్ లో పొగిడేస్తూ పోస్ట్ చేశాడు.

Nani Dasara : అమెరికాలో నాని సరికొత్త రికార్డ్.. మహేష్ తర్వాత నాని ఒక్కడే..

తాజాగా దసరా సినిమా చూసిన ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దసరా పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఇప్పుడే దసరా సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు నానికి నా అభినందనలు. నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, కీర్తి సురేష్, మిగిలిన టీం అంతా బాగా వర్క్ చేశారు. మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి అని పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ పోస్ట్ వైరల్ గా మారింది.