Prabhas : సలార్ టీం మెంబెర్స్ అకౌంట్‌కి ప్రభాస్ రూ.10 వేలు డిపాజిట్.. ఫొటోలు వైరల్!
ఆదిపురుష్ రిలీజ్ సమయంలో ప్రభాస్ సలార్ మూవీ టీం మెంబెర్స్ అకౌంట్ లోకి రూ.10 వేలు డిపాజిట్ చేశాడట. అందుకు సంబంధించిన ఫోటోలు..
Prabhas Salaar : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ (Adipurush) సినిమా రేపు (జూన్ 16) రిలీజ్ కాబోతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ ఆదిపురుష్ సందడి కనిపిస్తుంది. రామాయణ కథ కావడంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టిక్కెట్లు శరవేగంగా అమ్ముడు అయ్యిపోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఆదిపురుష్ సందడి జోరుగా కనిపిస్తుంది. అయితే మరోపక్క ప్రభాస్ సలార్ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
Adipurush : ఇండియా వైడ్ 4000 పైగా స్క్రీన్స్‌లో ఆదిపురుష్.. మొదటిరోజే 100 కోట్ల కలెక్షన్స్..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ కోసం పని చేస్తున్న సహాయక సిబ్బంది ఒక్కొక్కరి అకౌంట్స్ లోకి ప్రభాస్ రూ.10 వేలు డిపాజిట్ చేశాడట. రీజన్ ఏంటనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఆ లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 480 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తుంది. ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
మొదటిరోజు ఈ చిత్రం 75 నుంచి 100 కోట్ల వరకు ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణసంస్థలు టి సిరీస్, రెట్రోఫైల్స్ కలిసి 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించాయి. రామాయణ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రేపు బాక్స్ ఆఫీస్ వద్ద రామరావణ యుద్ధం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకోబోతుందో చూడాలి.
A big appreciation to #Prabhas 👏.
He has deposited 10K to every #Salaar support staff for their day and night tireless work for the movie. July teaser🎯 pic.twitter.com/qtWW0PwRYm— MNV Gowda (@MNVGowda) June 14, 2023