Adipurush : ఏలూరులో ప్రభాస్ అభిమానులు ఆందోళన.. సంగారెడ్డి జిల్లాలో థియేటర్ ద్వాంసం..
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. దీంతో థియేటర్స్ వద్ద అభిమానులు కోలహలం కనిపిస్తుంది. కానీ కొన్ని థియేటర్స్ వద్ద మాత్రం..

Prabhas fans celebrations at Adipurush theaters in telugu states
Prabhas Adipurush : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు తెల్లవారుజామునే కొన్నిచోట్ల బెన్ఫిట్ షోలు పడుతుండడంతో అర్ధరాత్రి నుంచి థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానుల కోలహలం కనిపిస్తుంది.
Adipurush : నేపాల్‌లో ఆదిపురుష్ వివాదం.. డైలాగ్ తీసేయాలంటూ నేపాల్ నేతలు.. అసలు ఏమైంది?
ప్రభాస్ సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి ఏరియా భీమవరం, ఏలూరులో సినిమా దియేటర్స్ వద్ద అయితే ప్రభాస్ అభిమానులు.. దియేటర్స్ వద్ద ప్లక్సిలు, కాషాయ జెండాలతో జై శ్రీరామ్ అంటూ నినాదాలతో సందడి చేస్తున్నారు. ఇక భీమవరంలోని ఒక ప్రభాస్ అభిమాని.. ప్రభాస్ లా రాముడు వేషధారణతో రథంపై భీమవరం రోడ్లపై ఊరేగుతూ సందడి చేశాడు.అలాగే శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కూడా ఆదిపురుష్ సందడి జోరుగా కనిపిస్తుంది. రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శన ఉండడంతో అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.
నిర్మల్, కొమురం భీం, ఆదిలాబాద్, విశాఖ జిల్లాలతో పాటు పలు చోట్ల థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు భారీగా చేరుకొని పాలాభిషేకాలు, గజమాలలతో ప్రభాస్ కట్ అవుట్స్ పై తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక విశాఖ జగదాంబ థియేటర్ వద్ద అయితే కొందరు అభిమానుల.. సినిమా అయిపోయిన తరువాత బయటకు వస్తున్న అభిమానులకు ప్రసాదాలు పంపిణీ చేస్తు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Adipurush : ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి..? గ్రాఫిక్స్ గురించి ఆడియన్స్ ఏమంటున్నారు..?
అయితే కొన్ని థియేటర్స్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు సత్యనారాయణ థియేటర్ స్క్రీన్ వన్ లో సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల వరకు వాయిస్ రాకపోవడంతో అభిమానుల ఆందోళన చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం ప్రదర్శన నిలిపివేసి టెక్నికల్ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు యాజమాన్యంతో గొడవకు దిగారు. అయితే వారికి సర్ది చెప్పి కొంతసేపటికి సినిమా ప్రదర్శించనప్పటికీ సౌండ్ సిస్టం సరిగా లేకపోవడం, డైలాగ్స్ అసలు అర్ధంకాకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి లోనయ్యి థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో ఆ థియేటర్ లోని సినిమాని నిలిపివేశారు.