Salaar : ప్రభాస్ అభిమానులా మజాకా.. ఈ రేంజ్ సెలబ్రేషన్స్ నెవెర్ బిఫోర్..
ప్రభాస్ అభిమానులు మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని నెవెర్ బిఫోర్ అన్నట్లుగా చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుంటే.. థియేటర్ వద్ద భారీ కట్ అవుట్స్ కి పూలదండలు, పాలాభిషేకాలు చేయడం, లేదా డీజే బ్యాండ్ తో సందడి చేయడం అందరూ చేసేదే.

Prabhas fans celebrations on the occasion of Salaar movie release
Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా part 1 సీజ్ ఫైర్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, టీంను ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్ కథాంశంతో తెరకెక్కింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్రశత్రువులుగా ఎలా మారారు అన్నదే ఈ సినిమా కథ. కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, అందులోనూ ప్రభాస్ హీరో అవ్వడంతో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
దీంతో ఈ సినిమాని మొదటిరోజే చూసేందుకు ఆడియన్స్ టికెట్స్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, ప్రభాస్ అభిమానులు మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని నెవెర్ బిఫోర్ అన్నట్లుగా చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుంటే.. థియేటర్ వద్ద భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేసి, వాటికీ పూలదండలు, పాలాభిషేకాలు చేయడం, లేదా డీజే బ్యాండ్ తో సందడి చేయడం అందరూ చేసేదే. కానీ ప్రభాస్ అభిమానులు అందుకు బిన్నంగా, నేటి ట్రెండ్ కి తగ్గట్టు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద రెబల్ అభిమానులు చేసిన సందడి అందర్నీ ఆకట్టుకుంటుంది.
Also read : Salaar Twitter Review : సలార్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
ఒక మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం ఎలా రెడీ చేస్తారో. అలా సిద్ధం చేసి గురువారం రాత్రి నుంచి ప్రీమియర్ షో పడే వరకు ఒక మినీ మ్యూజికల్ కాన్సర్ట్ ని నడిపారు. ప్రభాస్ పాటలతో రెబల్ అభిమానులు సందడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నేషన్ వైడ్ వైరల్ అవుతున్నాయి. మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని ఇలా కూడా చేస్తారా..? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సెలబ్రేషన్స్ వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram