Salaar : సలార్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారు..?

సలార్ ఫస్ట్ పార్ట్ లో ఆల్మోస్ట్ సినిమాలోని అన్ని పాత్రలను ఆడియన్స్ కి పరిచయం చేసేశారు. కానీ ప్రభాస్ తండ్రి పాత్రను మాత్రం పరిచయం చేయలేదు.

Salaar : సలార్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారు..?

Prabhas father character in Salaar movie who will play

Updated On : December 26, 2023 / 10:49 PM IST

Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, శ్రియారెడ్డి, శ్రుతిహాసన్, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరి రావు.. ఇలా భారీ స్టార్ క్యాస్ట్ నటించింది. ఈ ఫస్ట్ పార్ట్ లో ఆల్మోస్ట్ సినిమాలోని అన్ని పాత్రలను ఆడియన్స్ కి పరిచయం చేసేశారు. అయితే సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రను మాత్రం పరిచయం చేయలేదు.

సినిమా చివరిలో దేవ (Prabhas) తండ్రి ‘ధార’ని చంపేసినట్లు పేస్ రివీల్ చేయకుండా సైడ్ కట్ లో చూపిస్తారు. కాగా మూవీలోని ఖాన్సార్ సింహాసనానికి మొదటి రాజు ధారానే. మరి సెకండ్ పోర్టులో ఆ పాత్రకి సంబంధించిన కథని పూర్తి స్థాయిలో చూపిస్తారా..? ఒకవేళ చూపిస్తే ఆ పాత్రలో ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు నటించబోతున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయానే మూవీ టీం కూడా హైలైట్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది.

Also read : Salaar : నేపాల్‌లో కూడా ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా.. గేట్లు ఎక్కేసి రచ్చ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..

అయితే కొంతమంది అభిమానులు ఆ పాత్రని కూడా ప్రభాసే పోషిస్తున్నాడని చెబుతున్నారు. గతంలో మూవీ నుంచి మెలితిప్పిన మీసంతో, కొంచెం ఓల్డ్ లుక్ లో ఉన్న ప్రభాస్ లుక్స్ ని రిలీజ్ చేశారు. అయితే మూవీలో ప్రభాస్ లుక్ అలా లేదు. దీంతో ఆ లుక్ తండ్రి పాత్రదే అంటున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీలోని కొన్ని పాత్రల మధ్య కనెక్షన్స్ ఆడియన్స్ కి అర్ధం కాలేదు. దీంతో ఆడియన్స్ కొంచెం తికమక గురవుతున్నారు. అయితే ఈ విషయం కూడా ఇప్పుడు సినిమా ప్రమోషన్ కి హెల్ప్ అవుతుంది.

కొంతమంది నెటిజెన్స్.. ఈ ఖాన్సార్ సింహాసనం రాజుల కథని, ఆ రాజుల వారసుల కథని డీటెయిల్ గా తెలియజేస్తూ కొన్ని వివరణలు ఇస్తున్నారు. ప్రస్తుతం సలార్ ఫ్యామిలీ ట్రీ, పాత్రల మధ్య కనెక్షన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవేళ మీకు సలార్ సినిమాలోని పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదంటే.. ఈ వీడియో చూసేయండి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.