Prabhas : ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్.. రాజాసాబ్ షూట్ నుంచి..
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మూవీ ది రాజా సాబ్.

Prabhas Latest pic from The Raja Saab shooting spot viral
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మూవీ ది రాజా సాబ్. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. బర్త్‌డే సందర్భంగా ఆయనకు ప్రభాస్ విషెస్ తెలియజేశారు. ఆ సమయంలో ప్రభాస్‌తో ఎస్‌కేఎన్ ఓ ఫోటో దిగారు.
తాజాగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఇందులో డార్లింగ్ లుక్ వావ్ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Humaira Asghar Ali : తన అపార్టుమెంట్‌లోనే శవమై కనిపించిన నటి.. కుళ్ళిపోయిన స్థితిలో..
A REBEL vibe. A DARLING presence.
Straight from the world of #TheRajaSaab ❤️🔥#Prabhas @SknOnline pic.twitter.com/CdqjbZBkRT— The RajaSaab (@rajasaabmovie) July 10, 2025
ది రాజా సాబ్ మూవీ రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.